Site icon NTV Telugu

CEO Vikas Raj : ఓటు వేసే భాధ్యతను మరిచి పోవద్దు

Vikas Raj

Vikas Raj

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 13న జరిగే ఓటింగ్ రోజున తమ ఓటు వేసే బాధ్యతను మరచిపోవద్దని రాష్ట్ర ఎన్నికల సిఇఓ వికాస్ రాజ్ అన్నారు.  శనివారం ఎస్ఆర్ నగర్ లో సిఇఓ ఇంటి వద్దకు వెళ్లి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లీప్, పోలింగ్ తేదీతో పాటు ఓటరుగా గర్వ పడుతున్నాను అనే స్టిక్కర్ ను జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ వికాస్ రాజ్ కు అందజేశారు. ఈ సందర్భంగా సిఇఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ… ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలని అన్నారు.  ప్రజాస్వామ్య మనుగడ దేశ భవిష్యత్తుకు ఓటు ఒక ఆయుధం లాంటిదని పార్లమెంట్ ఎన్నికలు మే 13 న ఓటింగ్ ను ప్రజాస్వామ్య పండుగ భావించాలని అన్నారు. ఎపిక్ కార్డు ఉంటే సరిపోదని ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో సరి చూసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా  కమిషనర్ ఇంటింటికీ ఓటర్ స్లీప్, స్టిక్కర్ పంపిణీ వివరాలను సిఇఓ కు వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి బిఎల్ఓ లు  ఓటరు ఇన్ఫర్మేషన్ స్లీప్ లు స్టిక్కర్ పంపిణీ చేస్తున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ శాతం స్లిప్ ల పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ సిఈఓ కు వివరించారు.  అంతకు ముందు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ డిజిపి రవి గుప్త ఇంటికి వెళ్లి  ఓటర్ స్లిప్, స్టిక్కర్  ను అందజేశారు. 

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ… రాష్ట్రంలో మే 13వ తేదీన ఓటింగ్ కు ఏర్పాటుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించు కొనుటకు ముందుకు రావాలని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని తమకు నచ్చిన నాయకుని ఎన్నుకొనే అవకాశం ఉంటుందని డిజిపి పేర్కొన్నారు.

Exit mobile version