NTV Telugu Site icon

Kishan Reddy: MMTS ఫేజ్ – II ప్రాజెక్టు ఆలస్యానికి కారణం ఎవరు?

Kishan 1

Kishan 1

తెలంగాణ సర్కార్ పై ఒక రేంజ్ లో ఫైరయ్యారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల ఆలస్యానికి కేసీఆర్ కారణమన్నారు. 1:2 రేషియో ప్రాతిపదికన రూ.816.55 కోట్ల అంచనా వ్యయంతో 2012-13 లో మంజూరు చేసిన MMTS ఫేజ్ – II ప్రాజెక్టుకు తన వాటా నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వస్తోంది. అయినా నేడు కేంద్రం సహకరించకపోయినా మేము పూర్తి చేస్తాం అని మాటలు మాట్లాడటం ఒక్క కల్వకుంట్ల కుటుంబానికే చెందుతుంది.

Read Also: Jeevitha Rajashekar: నరేష్ చేతిలో అడ్డంగా మోసపోయిన జీవితా రాజేశేఖర్..

కేసీఆర్ ను మొదలుకొని కల్వకుంట్ల కుటుంబం మాట్లాడే మాటలకు ఏపాటి విలువ ఉందో, మాటమీద ఎంతలా నిలబడతారో, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పనిగట్టుకొని అసత్యాలను ఎంతలా ప్రచారం చేస్తారో గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. పెరిగిన అంచనా వ్యయం ప్రకారం మొత్తం ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1122 కోట్లకు పెరగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా క్రింద దాదాపు ₹760 కోట్లు చెల్లించవలసి ఉండగా ఇంతవరకూ చెల్లించింది కేవలం రూ.179 కోట్లు మాత్రమే.

కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.374 కోట్లు చెల్లించవలసి ఉండగా ఇప్పటికే దాదాపు రూ.790 కోట్లు ఖర్చు చేసింది. ఇదే విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యక్తిగతంగా నేను 4 సార్లు లేఖలు వ్రాసినా ఎటువంటి స్పందన, సహకారం లేదు. మరి MMTS ఫేజ్ – II ప్రాజెక్టు పూర్తి కావడానికి సహకరించనిది కేంద్ర ప్రభుత్వమా? కేసీఆర్ ప్రభుత్వమా? అన్నది కల్వకుంట్ల కుటుంబం హైదరాబాద్ ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. గచ్చిబౌలి లో శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్రప్రభుత్వంపై మండిపడ్డ సంగతి తెలిసిందే. కేంద్రం సహకరించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో ఎంఎంటీఎస్ 2 దశ గురించి సంప్రదింపులు చేస్తున్నామని, కేంద్రం నిధులివ్వకపోయినా మేం ఆ ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. దీనిపై కిషన్ రెడ్డి పై విధంగా స్పందించారు.

Read Also: Asaduddin Owaisi: గుజరాత్ అల్లర్లు.. అమిత్ షా కామెంట్‌కి ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్