Site icon NTV Telugu

Amit Shah Telangana Tour: అమిత్ షా తెలంగాణ టూర్.. షెడ్యూల్ ప్రకటించిన బీజేపీ

Amit Shah

Amit Shah

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. డిసెంబర్ 28న ఆయన రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్‌లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కేడర్‌కి లోక్‌సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్, భాగ్యలక్ష్మీ అమ్మవారికి అమిత్ షా ప్రత్యేకపూజలు నిర్వహిస్తారని సమాచారం.

Also Read: Vinesh Phogat: ఖేల్‌రత్న, అర్జున అవార్డులను తిరిగి ఇవ్వాలనుకుంటున్నా.. ప్రధానికి వినేష్ ఫోగట్ బహిరంగ లేఖ

అనంతరం రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్‌లో బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. తర్వాత బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు బీజేపీ అమిత్ షా టూర్‌ను షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎల్లుండి 12 గంటలకి ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. ఆ తర్వాత 12 గంటల 20 నిమిషాల నుండి 1: 45 నిమిషాల వరకు శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో లంచ్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత 5 గంటల నుండి 5.30 వరకు నోవటెల్ హోటల్ నుంచి బయలుదేరి 5.40కి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరికి పయనమవ్వనున్నారు.

Also Read: Central Bank of India Recruitment: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

Exit mobile version