Telangana: తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వాటా కింద రూ. 4872 కోట్ల నిధులకు అనుమతినిచ్చింది. రాష్ట్రంలోని రహదారి మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్ ఇప్పటికే అనేక ప్రతిపాదనలను రెడీ చేస్తోంది. అయితే, 2023- 24లో రూ. 1,900 కోట్లు, 2024- 25లో రూ. 3,272 కోట్ల నిధులను విడుదల చేయగా.. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా నిధులను కేంద్ర సర్కార్ కేటాయించింది. దీంతో రాష్ట్ర రహదారుల అభివృద్ధి మరింత తొందరగా జరిగే అవకాశం ఉంది.
Read Also: Cyclone and Heavy Rains: భారీ వర్షాలపై సర్కార్ హైఅలర్ట్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అయితే, వార్షిక ప్రణాళికలో భాగంగా కొత్త రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, వీటి నిర్మాణానికి అవసరమైన డీపీఆర్‌లు, ప్రాజెక్ట్ రిపోర్ట్‌లను సెప్టెంబర్ నెలాఖరు లోపే పంపించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఆర్ అండ్ బీ శాఖ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, ప్రాజెక్ట్ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి అందిన తర్వాతే నిధుల విడుదల జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ యంత్రాంగం డీపీఆర్‌లు సిద్ధం చేయడంలో వేగం పెంచింది.
