NTV Telugu Site icon

CBI Notices to Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు

Gangula Kamalakar

Gangula Kamalakar

CBI Notices to Gangula Kamalakar: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ అరెస్ట్‌పై నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి వాంగ్మూలం నమోదు చేసేందుకు సీబీఐ అధికారులు ఇవాళ కరీంనగర్‌లోని గంగుల ఇంటికి వెళ్లారు. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో సీబీఐ శ్రీనివాసుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి చీటింగ్ పాల్పడుతున్నట్లు శ్రీనివాస్ విచారణలో పేర్కొనడంతో ఇవాళ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గంగుల కమలాకర్ శ్రీనివాస్ తో ఎప్పటి నుంచో పరిచయం ఉంది.. ఎప్పుడు కలిశారు.. ఏం మాట్లాడుకున్నారు? అనే కోణంలో విచారించానున్నారు. గంగూతో పాటు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ గాయత్రి రవికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌తో శ్రీనివాస్‌ ఉన్న ఫొటోలను సీబీఐ గుర్తించింది. శ్రీనివాస్ తో గంగుల కమలాకర్ కు ఉన్న సంబంధాలపై సీబీఐ విచారించనున్నట్లు తెలుస్తోంది.

Read also: Liger: ఈడీ ముందుకి విజయ్ దేవరకొండ…

విశాఖ పట్నం చిన్నవాల్తేర్ కు చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాస్ రావు ఫేక్ సీబీఐ అధికారిగా చెలామణీ అవుతూ వివిధ వ్యక్తుల నుంచి డబ్బును స్వీకరించాడు. ఈ న‌కిలీ సిబిఐ అధికారిని ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో సీబీఐ అరెస్టు చేసింది. నిందితుడు తనను తాను సీబీఐ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌గా.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా ప‌రిచ‌యం చేసుకునేవాడ‌ని విచార‌ణ‌లో తేలింది. నిందితుడికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగంలో మంచి పరిచయాలున్నట్లు సమాచారం. సిబిఐ పేరుతో అత‌ను కోట్ల రూపాయల డీల్‌లు చేసిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై కూడా దృష్టి సారించింది.

read also: HIT 2: బాలయ్య లక్కీ డేట్ లో శేష్ హిట్ కొడతాడా?

నిందితుని ఇళ్లలో సోదాలు నిర్వహించగా రూ. 21 లక్షల నగదు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. త‌మిళ‌నాడులో ఒక డీల్‌కు సంబంధించి న‌కిలీ అధికారి చేసిన సంభాష‌ణ‌, డ‌బ్బులు డిమాండ్ చేయ‌డంతో కొందరు సీబీఐకి స‌మాచారం ఇవ్వడంతో అసలు కథ బట్టబయలు అయ్యింది. దీంతో నిందితుడి ఆచూకీ కోసం సీబీఐ ఆదివారం రాత్రి ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకుని మూడో అంతస్తులో ఉన్న మరో వ్యక్తితో నిందితుడు మొబైల్ ద్వారా మాట్లాడుతుండటంతో అక్కడుకు వెళ్లి శ్రీనివాస్‌ ను అదుపులో తీసుకున్నారు. మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా కీలక సమాచారం రాబట్టనున్నారు. నకిలీ ఐపీఎస్ ఐడెంటిటీ కార్డు, విజిటింగ్ కార్డులు, కారుతో సహా పలు కీలక పత్రాలు, వస్తువులను సీబీఐ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చినట్లు తెలిస్తోంది. నిందితుడు ఎమ్మెల్యే పేరు ప్రస్థావించాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు ప్రశ్నించనున్నారు.