NTV Telugu Site icon

CBI: మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష విధింపు

Cbi

Cbi

అరుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించిన సీబీఐ న్యాయస్థానం… హైదరాబాద్‌లో కొత్తపల్లి గీతను అదుపులోకి తీసుకున్న సీబీఐ టీమ్.. బెంగళూరుకు తరలించింది… పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి రూ. 52 కోట్లు లోన్‌ తీసుకొని ఎగ్గొట్టినట్టు గీత దంపతులపై అభియోగాలున్నాయి… విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి రూ. 52 కోట్లు రుణంగా తీసుకున్న కొత్తపల్లి గీత దపంతులు.. తిరిగి చెల్లించని కారణంగా.. సంబంధిత బ్యాంకు అధికారుల ఫిర్యాదు చేశారు.. దీంతో.. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు గీతను అరెస్ట్ చేశారు.

Read Also: Kothapalli Geetha Arreste: మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్.. కారణం ఇదే..?

2015లో పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ ఫిర్యాదు మేరకు కొత్తపల్లి గీతపై కేసు నమోదు చేసింది సీబీఐ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.. గీతతో పాటు ఆమె భర్త, హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఎండీపై కూడా కేసు నమోదైంది.. వీరి కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ42.79 కోట్లు నష్టం వాటిల్లందని చార్జిషీట్ లో పేర్కొంది సీబీఐ.. మాజీ ఎంపీకి సహకరించిన బ్యాంక్ అధికారులపై కూడా కేసులు పెట్టింది… ఐపీసీ 120, 420, 458, 421, 13(2), రెడ్ విత్ 1(సి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సీబీఐ.. ఇక, కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పర్చారు.. కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించిన సీబీఐ కోర్టు.. గీతతో పాటు ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించింది.. ఇక, బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కూ ఐదేళ్ల శిక్ష పడింది.. విశ్వశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ. 2 లక్షల జరిమానా విధించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.