NTV Telugu Site icon

మంత్రి తలసాని కుమారుడుపై కేసు…

మంత్రి తలసాని కుమారుడిపై సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు. ఖైరతాబాద్‌లో జరుగుతున్న సదర్‌ ఉత్సవాలకు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారు తలసాని సాయికిర్‌ణ్‌ తన కారులో వచ్చారు. ఈ నేపథ్యంలో సాయికిరణ్‌ వస్తుండగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఇందిరానగర్‌కు చెందిన సంతోష్‌ (32) అనే వ్యక్తి పాదం పై నుంచి ఆయన కారు పోవడంతో ఆ వ్యక్తి గాయాలయ్యాయి.

దీంతో సదరు బాధితుడు సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో తలసాని సాయికిరణ్‌పై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.