మరికొద్ది గంటల్లో ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా కోసం అటు మెగా అభిమానులు.. ఇటు నందమూరి అభిమానులు ఎన్నాళ్ల నుంచో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ఈ మూవీకి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. అయితే RRR అంటే రణం రుధిరం రౌద్రం అని చాలామందికి తెలుసు. కానీ ప్రముఖ తెలుగు కార్టూనిస్ట్ మృత్యుంజయ్ తన కార్టూన్ ద్వారా RRR అంటే కొత్త అర్థం చెప్పారు. వృక్షో రక్షతి రక్షిత: అని కొత్త నిర్వచనం ఇచ్చారు.
దర్శకుడు రాజమౌళితో పాటు ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ మొక్కలు పట్టుకొని నిల్చున్నట్లు కార్టూనిస్ట్ మృత్యుంజయ్ కార్టూన్ వేశారు. ఈ కార్టూన్‌ను టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మంచి కార్టూన్ ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా RRR సినిమా టీమ్ బుధవారం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన విషయం తెలిసిందే.
