Site icon NTV Telugu

Rajendranagar: బాలికల అనాథాశ్రమంలో కేర్ టేకర్ దారుణం.. పురుషుల ఎదుట దుస్తులు విప్పించి..

Rajendranagar

Rajendranagar

Rajendranagar: హైదరాబాద్ రాజేంద్రనగర్ అనాథాశ్రమంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అందులో కేర్ టేకర్ గా పనిచేస్తున్న సునీత అనాధ బాలికల దుస్తులు విప్పి మగవాళ్ళ ముందు నిలబెడుతూ అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో కేర్ టేకర్ ప్రవర్తనతో విసుగు చెందిన అనాథ బాలికలు ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ కి చెప్పారు. దీంతో చలించిపోయిన స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్రనగర్ పోలీసులతో పాటు షి టీమ్స్ కి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసి సునీతను అదుపులోకి తీసుకున్నారు.

అనాథలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఓ మహిళ రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్ పూరలో 15 సంవత్సరాల క్రితం అనాథాశ్ర మాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రస్తుతం 45 మంది బాలికలున్నారు. వారంతా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు తొలుత తన తల్లిని కేర్ టేకర్ గా నియమించారు. ఆమె వృద్ధురాలు కావడంతో రెండేళ్ల కిందట మరో మహిళను ఆమె స్థానంలో నియమించారు. కొత్తగా చేరిన కేర్ టేకర్ బాలికలను చిత్రహింసలు పెట్టసాగింది. విసుగు చెందిన బాలికలు విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. ఈవిషయాన్ని వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు, షీ టీమ్ కు తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలికలతో మాట్లాడారు. దీంతో సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి.

తాను చెప్పిన మాట వినకపోతే దుస్తులిప్పించి అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట నిలబెడుతోందని బాలికలు పోలీసులకు తెలిపారు. నీలిచిత్రాలు పెట్టి వాటిని చూడాలని బలవంతం చేస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనాధాశ్రమానికి చెందిన 25 మంది బాలికలు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వేధింపుల విషయం తెలుసుకుని చలించిపోయిన అక్కడి ప్రధానోపాధ్యాయురాలు శుక్రవారం సమస్య తీవ్రంగా ఉండటంతో ఉపాధ్యాయులతో కలిసి బాలికలు రాజేంద్రనగర్ రాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో ఆదేశాల మేరకు పోలీసులు కేర్ టేకర్ సునీతను రాణాకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. సంస్థ వ్యవస్థాపకురాలితో అందులో పనిచేసే వారిని విచారిస్తున్నారు. కాగా మహిళా శిశు సంక్షేమ అధికారులు రాణాకు చేరుకుని బాలికలను పరామర్శించారు.
Foxtail Millet: షుగర్ పేషెంట్స్‭కు కొర్రలు నిజంగానే మేలు చేస్తాయా..?

Exit mobile version