ఈమధ్యకాలంలో భారీ వర్షాల వల్ల రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. వాగుల వెంట వెళ్లే కార్లు ప్రమాదాల బారినపడుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలో పెను ప్రమాదం తప్పింది. బొగత జలపాతం వీక్షించి తిరిగి వెళుతుండగా దూలాపురం వద్ద కాలువలోకి దూసుకెళ్లింది కారు. ఆ కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు కాలువలో ఉండటాన్ని గమనించిన స్థానికులు అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు లాగారు.
Monkeypox: మంకీపాక్స్‌పై కేంద్రం అప్రమత్తం.. ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి సమావేశం
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కారు ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు హైదరాబాద్ కు చెందిన వారు. వీరంతా ఆదివారం కావడంతొ బొగత జలపాతం వీక్షించి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వీరంతా ప్రాణాపాయం లేకుండా క్షేమంగా బయటపడ్డారన్నారు. టూరిస్టు ప్రాంతాలకు వెళ్లేవారు వర్షాకాలం తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు.
గొర్రెలపై కుక్కల దాడి
శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని నెమలికొండ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున గొర్రెల మందపై కుక్కల గుంపు దాడి చేసింది. ఈఘటనలో ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. పలాస పురుషోత్తపురానికి చెందిన గొర్రెల యజమాని కె.ఆదినారాయణతో పాటు మరి కొందరు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన గొర్రెలను చూసి లబోదిబోమంటున్నారు.
