NTV Telugu Site icon

Ganjai In Car: పల్టీ కొట్టిన కారు.. అందులో ఏముందంటే?

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ చూసినా.. ఎక్కడ తనిఖీలు చేసినా గంజాయి గుప్పుమంటోంది. తాజాగా ఓ ప్రమాదంలో గంజాయి బయటపడడంతో అంతా అవాక్కయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గోదావరి బ్రిడ్జి సమీపంలో ఒక ప్రమాదం జరిగింది. అదుపు తప్పి పల్టీ కొట్టింది ఓ కారు. అయితే పల్టీ కొట్టిన కారులోంచి బయటపడ్డ వస్తువులు చూసి అక్కడున్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆకారులో ఏం దొరికిందో తెలుసా.. భారీ మొత్తంలో గంజాయి. కారులో గంజాయి ఉండడంతో స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలోని సారపాకలోని భద్రాచలం బ్రిడ్జ్ సమీపంలో అదుపు తప్పి పల్టీ కొట్టడంతో కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది. రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రమాదానికి గురైన కారుని యథాతథ స్థితికి తీసుకువచ్చి ఆ కారులో ఉన్న గంజాయిని స్వాధీనపరచుకొని స్టేషన్‌కి తరలించారు. ప్రమాదం జరగడం, అందులో గంజాయి బయట పడడంతో కారులో వున్న డ్రైవర్ తో పాటు అందులో ఉన్నవారు పరారయ్యారు. బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గంజాయి ఎక్కడినించి తెస్తున్నారు, ఈ ముఠా వెనుక వున్నది ఎవరనేది కారు ఆర్టీయే నెంబర్ ఆధారంగా ఆరా తీస్తున్నారు.
Cell Tower: మద్యం మత్తులో సెల్ టవరెక్కి….