Atrocious: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గాన్సీమియాగుడా గ్రామం వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తితో కడుపులో పొడిచి బండరాళ్ళతో మోది హతమర్చారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద దొరికిన ఓ భ్యాగ్ ఆధారంగా మృతుడి వివరాలను తెలుసుకున్నారు. హత్యకు గురైన యువకుడు పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన మల్లేష్ గా గుర్తించారు. కొన్నాల క్రితం భార్య వదిలిపెట్టడంతో శంషాబాద్ ప్రాంతానికి వచ్చి అడ్డాకులిగా మారాడు. అయితే అప్పుడప్పుడు ఝాన్సీమియా కూడా వద్ద ఉన్న టెంట్ హౌస్ లో పనిచేసే పక్కనే ఉన్న ఓ గుడిలో తల దాచుకునేవాడు. అయితే రాత్రి ఘాన్సీమియా గుడా వద్ద బెంగళూరు జాతీయ రహదారి పక్కన హత్యకు గురై పడి ఉన్నాడు.
Read also: Vishwak Sen: ‘కల్ట్’ టైటిల్ అనౌన్స్మెంట్… బేబీ రివెంజా?
పోలీసులు హత్యపై ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపారు. హత్య చేసింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మల్లేష్ ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని ఆరా తీస్తున్నారు. భార్యను వదిలేసిన మల్లేష్ ఎవరితోనైనా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే మల్లేష్ కు బంధువులు ఏమయ్యారు? కుటుంబ సభ్యులు ఎవరు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మల్లేష్ కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మల్లేష్ కు ఎవరితోనైనా విభేదాలు వున్నాయా? వారే మల్లేష్ ను హతమార్చారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మల్లేష్ భార్య ఎక్కడ వుంది? ఆమెను మల్లేష్ మృతి విషయం తెలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Top Headlines @ 1PM: టాప్ న్యూస్!