NTV Telugu Site icon

Wild Murder: వికారాబాద్‌లో ఆటవిక ఘటన.. ముక్కు, చెవులు, నాలుక కోసి హత్య

Wild Murder

Wild Murder

Wild Murder: జనాల్లో రోజురోజుకూ సైకోయిజం పెరిగిపోతోంది. సినిమాల ప్రభావమో లేక సామాన్యంగా ప్రజల్లో క్రూరత్వం పెరిగిపోయిందో తెలియదు కానీ దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రైమ్ ఎప్పటినుంచో ఉంది.. కోపం, బాధ, ఒత్తిడి లాంటి భావోద్వేగాలు మనుషుల్లో హద్దులు దాటినప్పుడు ఈ నేరాల పర్యవసానాలే ప్రతిరూపాలు. అయితే.. ఈ నేరాలు ఎప్పటినుంచో ఉన్నాయి కానీ.. వాటి తీవ్రత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మనుషులను చంపడమే లక్ష్యంగా హత్యలే కాకుండా చిత్రహింసలతో బాధితులను అతి కిరాతకంగా, క్రూరంగా చంపేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో చోటుచేసుకుంది.

Read also: Success Love: లవ్‌లో సక్సెస్ కావాలంటే ఇందులో ఓడిపోవాల్సిందే..!

ఓ వ్యక్తి చెవులు, ముక్కు, నాలుక కోసి దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతుడు దౌల్తాబాద్‌కు చెందిన సంగేపల్లి శేఖర్‌గా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా హత్యకు ముందు శేఖర్‌ను అదే గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లడం చూశామని గ్రామస్తులు చెబుతున్నారు. కట్ చేస్తే.. శేఖర్ ను అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే పాత కక్షలు, వివాహేతర సంబంధాలే హత్యకు పాల్పడి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో అనుమానితుడిగా భావిస్తున్న గోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. ఈ హత్యకు వివాహేతర సంబంధమా.. మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Yuvraj Singh: ధోనీని ఎంతో నమ్మాను.. కానీ కోహ్లీ మాత్రమే సపోర్ట్ ఇచ్చాడు..

Show comments