Site icon NTV Telugu

Rangareddy Crime: రంగారెడ్డిలో దారుణం.. రూ.500 కోసం దారుణ హత్య..

Rangareddy Crime

Rangareddy Crime

Rangareddy Crime: రంగారెడ్డి జిల్లా అర్థరాత్రి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్వేల్‌లో ఓ వ్యక్తి హత్య సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా బద్వేల్‌లో శ్రీనివాస్‌ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గుత్తేదారు సాయికి రూ.500 అప్పుగా ఇచ్చాడు. నిన్న ఇద్దరూ కలిసి ఫుల్ గా మద్యం సేవించారు. సరదాగా మాట్లాడుకుంటూ అప్పుల వరకు మాటలు వెళ్లాయి. సాయికి అప్పు ఇచ్చానని తిరిగి ఇచ్చేయాలని శ్రీనివాస్‌ తెలిపాడు. దీంతో సాయి తన దగ్గర లేవని మళ్లీ ఇస్తానంటూ వాదించాడు.

Read also: TG Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. దేనికోసం అంటే..

అనంతరం రూ.500 కోసం ఇద్దరు మధ్య పెద్ద గొడవే అయ్యింది. శ్రీనివాస్, సాయి ఒకరినొకరు వాదించుకున్నారు. ఇప్పుడే తన డబ్బులు ఇచ్చేయాలని శ్రీనివాస్‌ పట్టుపడటంతో.. సాయి ఆగ్రహంతో రగిలిపోయాడు. తన పక్కనే వున్న డ్రైనేజ్ మూత తీసుకుని శ్రీనివాస్ తలపై ఒక్కసారిగా కొట్టాడు. దీంతో శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో ఘటన వద్దు పోలీసులు చేరుకుని శ్రీనివాస్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Varun Dhawan : బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ‘బేబీ జాన్’

Exit mobile version