NTV Telugu Site icon

BRS Party: సాయిచంద్ కుటుంబానికి అండగా బీఆర్ఎస్.. కుటుంబంలోని అందరికీ చెక్కులు..

Brs Part

Brs Part

BRS Party: తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సాయం చేసింది. ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో సాయిచంద్ కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రూ. 1.50 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు సాయిచంద్ కుటుంబానికి సోమవారం ఆర్థిక సాయం అందజేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి వెళ్లి ఆయన భార్య, పిల్లలకు చెక్కులు అందజేశారు. సాయిచంద్ భార్య వేదా రజనీకి రూ. 50 లక్షలు, పిల్లలు చరీష్, మీనల్ రూ. 25 లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి, కేసీఆర్ నాయకత్వానికి ఆశాకిరణం అయిన సాయిచంద్ లేకపోవడం జీర్ణించుకోలేని విషయమని ఆ సందర్భంగా మంత్రి సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: Uppal MLA Subhas Reddy: నేను చేసిన తప్పేంటి..? బేతి సుభాష్ రెడ్డి ఆవేదన..!

తన కుటుంబానికి అండగా నిలిచి ధైర్యంగా ముందుకు నడిపించినందుకు కేసీఆర్‌కు రజనీ కృతజ్ఞతలు తెలిపారు. సాయిచంద్ స్వగ్రామం వనపర్తి జిల్లా అమరచింత కూడా అతని తండ్రి వెంకట్రాములు, సోదరికి చెక్కులు అందజేశారు. తండ్రికి రూ.25 లక్షలు, చెల్లెలు ఉజ్వలకి రూ.25 లక్షలు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్‌మోహన్‌రెడ్డి, బాల్కసుమన్‌ పాల్గొన్నారు. ఉద్యమ గాయకుడు సాయిచంద్ పాటల రూపంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అలాగే వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉంటూ సాయిచంద్ హఠాన్మరణం చెందడంతో ఆ పదవిని ఆయన భార్య రజినీకి కేటాయించిన సంగతి తెలిసిందే.

ప్రముఖ గాయకుడు, ఉద్యమకారుడు దివంగత సాయిచంద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలోని దివంగత సాయిచంద్ ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లి రూ.లక్ష చెక్కులను అందజేశారు. సాయిచంద్ తండ్రి వెంకట్రామ్‌కు రూ. 25 లక్షలు, సాయిచంద్ సోదరి ఉజ్వలకి 25 లక్షల చెక్కులను అందజేశారు. సాయిచంద్ మృతి రాష్ట్రానికి తీరని లోటు అని మంత్రి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ ఎంతగానో పాలుపంచుకున్నారని, ఆయన చిన్న వయసులోనే మృతి చెందడం తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు. వారి కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి కార్మికుడిని కంటికి రెప్పలా కాపాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Show comments