NTV Telugu Site icon

BRS MPS: ఇదంతా కక్ష సాధింపే.. కవిత అరెస్టుపై బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఫైర్‌

Brs Mps

Brs Mps

BRS MPS: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ ఎంపీలు తొలిసారి స్పందించారు. కవిత అరెస్ట్ రాజకీయ కక్ష అని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, వావిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ ఇవాల ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేశారని అన్నారు. లొంగిపోయేలా చేసేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలనే ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు చెప్పారు.

Read also: Mayor Vijayalakshmi: కాంగ్రెస్ లో చేరనున్న నగర మేయర్ విజయలక్ష్మి..?

ఎంపీపీ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. బీఆర్ ఎస్ పార్టీని చీల్చేందుకు ఉద్యమ సమయంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయన్నారు. వీటన్నింటిని ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్నామని, ఇప్పుడు కేసుల నుంచి బయటపడతామన్నారు. ఎంపీ వావిరాజు రవిచంద్ర మాట్లాడుతూ కవిత నిందితురాలు కాదని బాధితురాలని అన్నారు. కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతానని చెప్పింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కవితను అరెస్ట్ చేశారని అంటున్నారు. ఎన్నికల్లో బీజేపీ చర్యలను ప్రజలు తిప్పికొట్టడం ఖాయం. ఎంపీ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలను దొంగల్లా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.

Drugs in Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..!