Site icon NTV Telugu

Palla Rajeshwar Reddy: పార్టీ మారే వాళ్ళ అక్రమాలను బయటకు తీస్తాం..

Palla Rajeshwer Reddy

Palla Rajeshwer Reddy

Palla Rajeshwar Reddy: పార్టీ మారే వాళ్ళ అక్రమాలను బయటకు తీస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు వస్తున్న నేతలపై కూడా ఆయన స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు అభ్యర్థులు లేక… మా వాళ్లను పిలిచి టికెట్లు ఇస్తున్నారని తెలిపారు. కొందరు ఇక్కడ గెలిచి వేరే పార్టీలలోకి వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిరికిపంద లే పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. అక్రమంగా సంపాదించు కున్న సొమ్మును సక్రమం చేసుకునేందుకు పార్టీలు మారుతున్నారని తెలిపారు. అలాంటి వారి అక్రమాలను మేమే బయట పెడతామన్నారు.

Read also: Manda Krishna Madiga: కడియం శ్రీహరి వల్లే..రాజయ్యను బీఆర్ఎస్ బర్తరఫ్ చేసింది

పార్టీ మారే వాళ్ళ అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరించారు. ఇక్కడ గెలిచి వేరే పార్టీ లోకి వెళ్లే వాళ్ళను ప్రజలే రాళ్లతో కొడతారన్నారు. గతంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారే వాళ్ళను రాళ్లతో కొట్టాలి అన్నారని గుర్తు చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై కూడా మాట్లాడారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. గత ప్రాజెక్టులను పూర్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ నాటకాలాడుతుందని ఆరోపించారు. లక్ష ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టును చేపట్టడంతోపాటు 12 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఉంటుందో, మీరు ఆ పార్టీలో ఎంతకాలం ఉంటారో ఆ దేవుడికే తెలియాలని హెచ్చరించారు.
BRS MPS: ఇదంతా కక్ష సాధింపే.. కవిత అరెస్టుపై బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఫైర్‌

Exit mobile version