Site icon NTV Telugu

Marri Janardhan Reddy: 150 కోట్లు ట్యాక్స్ కట్టాను.. పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తా

Marri Janardhan Reddy

Marri Janardhan Reddy

Marri Janardhan Reddy: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లల్లో ఐటీ సోదాలు కలకలం రేపతున్నాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో రెండో రోజు ఐటి సోదాలు కొనసాగుతుంది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇండ్లలో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తుంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా మొత్తం సోదాలు కొనసాగే అవకాశం ఉందని టాక్‌.

Read also: TS DH: విఆర్ఎస్‌కు హెల్త్ డైరక్టర్‌ దరఖాస్తు.. క్లారిటీ ఇచ్చిన శ్రీనివాసరావు

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. మేము ఐటి అధికారులకు సహకరిస్తున్నామన్నారు. మా సిబ్బంది కూడా సహకరిస్తున్నారని తెలిపారు. అయినా ఐటి అధికారులు మా సిబ్బందిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని చోట్ల మాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము కూడా అలాగే చేస్తామన్నారు. సోదాలు ముగిసిన తరువాత వారి సంగతి చూస్తామని హెచ్చారించారు. మా దగ్గర సెల్ ఫోన్ లు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటు కదల నివ్వడం లేదని మండిపడ్డారు. వ్యాపారం చేస్తున్నప్పుడు ఐటి వాళ్ళు వస్తారు.. చెక్ చేసుకుంటారని అన్నారు. మేము చెప్పేది చెబుతాం వాళ్ళు అడిగేది అడుగుతారని స్పష్టం చేశారు. నా లెక్కలు కడిగిన ముత్యంలా ఉంటుందని అన్నారు. ఎన్ని రోజులు జరిగిన సహరిస్తామన్నారు. మోదీ ది కొత్త రాజ్యాంగామా..? వ్యాపారం చేయోద్దా..? భూములు కొనడం తప్పా? అంటూ ప్రశ్నించారు. ఐటి అధికారులు నాకు అవార్డ్ ఇచ్చి వెళ్తున్నారని అన్నారు. 150 కోట్లు ట్యాక్స్ కట్టానని తెలిపారు. మా ఉద్యోగులను కొడుతున్నారని తెలుస్తుందని, తరువాత వాళ్ళ పని చూస్తా అని మండిపడ్డారు. తప్పు చేసే డబ్బులు కట్టించుకోవాలని అన్నారు. పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తా అని స్పష్టం చేశారు.
Realme 11 Pro 5G: 200MP కెమెరా, 5000mAh బ్యాటరీ.. రియల్‌మీ 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌ బుకింగ్, ఆఫర్స్ డీటెయిల్స్ ఇవే!

Exit mobile version