Site icon NTV Telugu

BRS leaders fire: టెన్త్‌ పేపర్‌ లీక్‌పై బండి సంజయ్‌ హస్తం.. బీఆర్ఎస్ నేతలు ఫైర్..

Brs, Bjp

Brs, Bjp

BRS leaders fire: తెలంగాణలో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. హిందీ పేపర్‌ని బండి వాట్సాప్‌కు పంపడం కుట్ర కాదా? అని ప్రశ్నింస్తున్నారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి

పేరల్‌ లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌ హస్తం వున్నట్లు తెలియడంతో.. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. క్వచ్చన్ పేపర్ నువ్వే బయటకు తీసుకువచ్చి, ఫొటో తీపించి టీవీలకు ఇచ్చింది బండి సంజయ్ ఏ అని మండిపడ్డారు. కేసీఆర్ ను బద్నామ్ చేస్తున్నావ్ అంటూ నిప్పులు చెరిగారు. అన్ని ప్రూప్స్ దొరికాయి … అన్ని ఆధారాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఉంటె ఓట్ల సమయంలో చూసుకుందాం.. బండి సంజయ్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే పనులు చేయొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ చేసే పనులకు బీజేపీ కార్యకర్తలు సపోర్ట్ చేయకండి అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ అరెస్ట్ చేసారని దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే మా కార్యకర్తలు ఊరుకోరుమని, మీ మీద భౌతిక దాడులకు సైతం మా కార్యకర్తలు వెనుకాడరంటూ హెచ్చరించారు. బీజేపీ వాళ్లు ఈ ట్రాప్ లో పడొద్దని సూచించారు.

మంత్రి జగదీష్ రెడ్డి

అడ్డంగా దొరికిపోయిన పోయిన దొంగ బండి సంజయ్ అని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మైనర్ బాలుడిని చెట్టు ఎక్కించి పేపర్ తెచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన దొంగ బండి సంజయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ని వెంటనే బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు. అన్ని ఆధారాలతో బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తే.. తప్పు చేసిన బండి సంజయ్ కి బీజేపీ నాయకులు సపోర్ట్ చేయడం సరైన పద్దతికాదని మండిపడ్డారు.

ఎమ్మెల్యే భాస్కరావు

పేపర్ల లీకేజీల వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉందని ఎమ్మెల్యే భాస్కరావు మండిపడ్డారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచనతో ప్రశ్నపత్రాలు లీకేజీ చేయాలనుకోవడం దారుణమన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీలో ఉన్న వ్యక్తికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు గుప్పించారు. రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని మండిపడ్డారు. త్తరాదిన బీజేపీ అగ్ర నేతలు చేసినట్లు చేయాలనుకుంటే తెలంగాణలో కుదరదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ పదవికి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్

10 వ తరగతి పేపర్ లీకేజీ కుట్ర బండి సంజయ్ దే అంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ మండిపడ్డారు. బండి సంజయ్, అనుచరుడు పేపర్ లికేజీలో వాస్తవం లేదా? అంటూ ప్రశ్నించారు. పిల్లల జీవితాలలో ఆడుకోవద్దని సూచించారు. పిల్లల భవిష్యత్ తో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజులలో ప్రజలు బుద్ధి చెబుతారు రేఖా నాయక్ అన్నారు.

ఎమ్మెల్యే గణేష్ గుప్తా

అధికార దాహంతో బీజేపీ నేతలు పేపర్ లీకులు చేస్తున్నారని ఎంఎల్ఏ.గణేష్ గుప్తా మండిపడ్డారు. పేపర్లు లీకులు చేస్తూ యువకుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల, మతాలను బీజేపీ రెచ్చగోడుతోందని ఆరోపణలు గుప్పించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో రాజశేఖర్ బీజేపీ కార్యకర్త, 10వ తరగతి హిందీ పరీక్షా పత్రం లీకేజీ చేసింది బీజేపీ కార్యకర్త ప్రశాంత్, పేపర్ లీకులతో బీజేపీ నేతలు రాష్ట్రాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు..? అని ప్రశ్నించారు. బీజేపీ నియంతృత్వంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అన్ని పేపర్లు లీకులు చేయాలనే కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
LA Rajasingh: విచారణ చేయండి హడావిడి ఎందుకు? జైలుకు పంపిస్తే భయపడే ప్రశక్తే లేదు..!

Exit mobile version