BRS Celebrations in Telangana: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ.. కేసీఆర్‌కు సీఈసీ అధికారికంగా లేఖ పంపింది. దీంతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ సంబరాలు మిన్నంటాయి. దీంతో ఈ సంబరాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి రానున్నారు. బేగంపేట్ కు నుంచి కుమార స్వామి నేరుగా సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. సీఎం కేసీఆర్‌తో తో సమావేశం కానున్నారు కుమార స్వామి. BRS ఆవిర్భావం సందర్భంగా కుమార స్వామి కలువనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రంమలో ఎంపీలు, ఎమ్మెల్యే లకు ప్రగతి భవన్ లో లంచ్ ఏర్పాటు చేయనున్నారు.
అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం చేయడం, మరుసటి రోజే ఆ తీర్మానం ప్రతిని టీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందించడం తెలిసిందే. ఈ తీర్మానం విషయాన్ని సస్పెన్స్‌లో ఉంచిన సీఈసీ, ఎట్టకేలకు ఈరోజు ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ కేసీఆర్‌కు సీఈసీ అధికారికంగా లేఖ పంపింది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 1:20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితిఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణ భవన్‌లో 1:20 గంటలకు తనకు అందిన అధికారిక లేఖకు రిప్లైగా కేసీఆర్ సంతకం చేసి, ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుంది. అనంతరం కేసిఆర్ బిఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని సీఎం కోరారు. వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు కూడా తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ఇక జాతీయ పార్టీగా అవతరించింది కాబట్టి ఇకపై సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుకుగా పాల్గొననున్నారని తెలుస్తోంది.
5 Lakh Votes For Nota: గుజరాత్‌లో నోటాకు భారీగా ఓట్లు..
