NTV Telugu Site icon

BRS Candle Rally: నేడు బీఆర్‌ఎస్‌ క్యాండిల్‌ ర్యాలీ.. గన్ పార్క్ నుంచి సచివాలయం వరకు

Brs Candil Ryali

Brs Candil Ryali

BRS Candle Rally: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదుట ఉన్న అమరజ్యోతి వరకు తెలంగాణవాదులు, ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జంటనగరాల పార్టీ శ్రేణులతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.

Read also: Tank Bund Traffic: ఆదివారం నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు ట్యాంక్‌బండ్‌ బంద్..

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం, పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు తదితర అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో ప్రజలకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులకు సూచించారు.
North Korea: మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు.. బెలున్లతో చెత్త!

Show comments