Medico Preethi Father: ఇష్యూని డైవర్ట్ చేయడానికే నిమ్స్ కి తీసుకొచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preethi father: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా వైద్య విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. సీనియర్ల వేధింపుతో పీజీ చేస్తున్న మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసుకుందన్న విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా వైద్య విభాగంలో చర్చకు దారి తీసింది. పీజీ లోనూ ర్యాగింగ్ జరుగుతుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే.. సీనియర్ విద్యార్ధి వేధింపులు తట్టుకోలేక దరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read also:Medico Preethi : కలకలం రేపుతున్న మెడికో ప్రీతి ఘటన.. అసలేం జరిగింది..?
Also Read
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
డైవర్ చేస్తున్నారు సార్ న్యాయం చేయండి
ఆత్మహత్యయత్నం చేసుకున్న ప్రీతిని ఇవాళ వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించిన అధికారులు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి ప్రీతి నీ తీసుకొని వచ్చిన అధికారులు. అయితే దీనిపై మెడికో ప్రీతి తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. వైద్య చికిత్సకు ఆమె శరీరం సహకరించట్లేదని కన్నీరుమున్నీరు అయ్యారు. ఇష్యుని డైవర్ట్ చేయడానికే నిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 20 వ తేది రాత్రి కాలేజీ దగ్గరికి వెళ్ళానని, ప్రీతి ఉన్నతాధికారులకు వేధింపులుపై చెప్పానని అన్నారు. కాని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. సీనియర్లు కదా మామూలుగా ర్యాగింగ్ ఉంటుంది అనుకున్నామని, గిరిజన యువతివంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురి చేశారని తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడుతున్న సైఫ్ తో మాట్లాడుతానని ప్రీతికి చెప్పినా వద్దు, మళ్ళీ ఇబ్బందులు ఉంటాయని, మార్కులు తక్కువ వేస్తారు అని భయపడిందని చెప్పుకొచ్చారు. ఎంతో ధైర్యంగా ఉండేది, కరోనాలో కూడా విధులు నిర్వర్తించిందని వాపోయాడు. అలాంటి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందంటే సైఫ్ ఎంతగా వేధీంచాడో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీకి చెడ్డ పేరు ఎక్కడో వస్తుందోనని నిమ్స్ కు తీసుకువచ్చారని కన్నీరుమున్నీరు అయ్యారు తండ్రి. మాకు న్యాయం చేయాలని, సైఫ్ ను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని తండ్రి నరేందర్ కోరుతున్నారు.
Read also: Minister KTR: నేడు భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటన.. 6 ప్రారంభోత్సవాలు, 2 శంకుస్థాపనలు
ప్రీతి సోదరుడు..
మూడు నెలల నుంచి ప్రీతిని సీనియర్లు వేధిస్తున్నారని ప్రీతి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. చదువు రాదని ఇష్టం వచ్చినట్లు వేధిస్తున్నారని అన్నారు. 24 గంటల పాటు డ్యూటీ చేయిస్తున్నారని, సీనియర్ల వేధింపులపై పలుమార్లు మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు గురిచేసి వారి నాన్న ఎస్ఐ కావడంతో అతని పేరు చెప్పి ప్రీతిని వేధించారని సోదరుడు ఆరోపించారు. నిన్న ఉదయం గుర్తుతెలియని ఇంజక్షన్ తీసుకొని ప్రీతి ఆత్మహత్యయత్నాలు పాల్పడిందని కన్నీరు మున్నీరయ్యాడు. ప్రస్తుతానికి ప్రీతి కోమాలో ఉందని, ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నాడు. 24 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేము అని వైద్యులు అంటున్నారని, ప్రీతి వ్యవహారాన్ని మేనేజ్మెంట్ దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందని ప్రీతి సోదరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Shooting : ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు గోల్డ్ మెడల్
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!