Sangareddy District: మానవ సంబంధాలు మంటగలిసి.. తల్లిదండ్రుల కళ్లెదుటే తమ్ముళ్లు కొట్టుకుని చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి విషాద ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
తండ్రికి చెందిన 14 గుంటల భూమిని ఎవరు సాగు చేయాలంటూ అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఇందులో తమ్ముడు ప్రాణాలు కోల్పోగా… తండ్రి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. కంబాలపల్లి గ్రామంలో కుమ్మరి చంద్రయ్య(65)కు ఇద్దరు కుమారులు కుమ్మరి ఆంజనేయులు(43), కుమ్మరి ప్రభు(46) నివాసం ఉంటున్నారు. తనకున్న వ్యవసాయ భూమిని సమానంగా పంచుకున్న తండ్రి.. 14 గుంటల భూమిని తన కోసం ఉంచుకున్నాడు. అయితే ఆ భూమిని ఎవరు సాగు చేయాలనే విషయమై ఇద్దరు అన్నదమ్ములు తరచూ గొడవ పడేవారు. తల్లితండ్రులిద్దరూ… చిన్న కొడుకు కూడా ఆంజనేయులు వైపే ఉండడంతో ప్రభుకి తల్లిదండ్రులు, తమ్ముడిపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. యాసంగి పంటను విత్తేందుకు శనివారం మధ్యాహ్నం తన తండ్రి భూమిలో దున్నుతున్న ఆంజనేయులిని అన్న ప్రభువు అడ్డుకున్నాడు.
Read also: Software Engineer Suicide: దూరం పెట్టిన ప్రేమికుడు.. మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య
ఈ విషయమై భార్య, తండ్రితో మాట్లాడుతుండగా ఆంజనేయులు రాత్రి అన్నం తింటున్నాడు. ఈలోగా ప్రభు తన భార్య, కొడుకుతో కలిసి గొడ్డలి, కట్టే, కారం తీసుకుని తిట్టుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లాడు. ప్రభు భార్య ఆంజనేయులు కండ్లలో కారం చల్లగా… ఆంజనేయులు పైన గొడ్డలితో విచక్షణరహితంగా దాడికి దిగాడు భర్త ప్రభు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రిని కూడా గొడ్డలితో నరికాడు. ప్రభు భార్య, ఇద్దరు కుమారులు కూడా వారిపై కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆంజనేయులు రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోగా, తీవ్రంగా గాయపడిన చంద్రయ్యను స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సదాశివపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభు, అతని భార్య, కొడుకును అదుపులోకి తీసుకున్నట్లు గుర్తించారు. ఆంజనేయులు పనిచేస్తేనే తమ కుటుంబం బతుకుతుందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని, ఆయన మృతితో ఇద్దరు పిల్లలు, భార్య నిస్సహాయులయ్యారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.
Fire Accident : ప్రమాదమా లేదా హత్యా.. బరేలీలో సజీవ దహనమైన కుటుంబం
