NTV Telugu Site icon

Tragedy in Marriage: తెల్లారితే పెళ్లి.. ఇంతలోనే వరుడు

Asifabad Crime

Asifabad Crime

Tragedy in marriage: రోహిణి కార్తెలో ఎండ ప్రభావం తీవ్రంగా ఉంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 6 దాటినా.. వాతావరణం చల్లబడడం లేదు. పగటి పూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. గత వారం రోజులుగా ఈ సీజన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే , జూన్ నెలల్లో 15 రోజుల గరిష్ట ఉష్ణోగ్రత 45.7 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. దీంతో జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. బానుడి భగ భగ వాటా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానియాలు తాగుతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈక్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బయట తిరిగే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. అయితే ఈఎండల వల్ల చాలా మంది మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. తెల్లారితే పందిట్లో చేసుకోవాల్సిన యువకుడు విగతజీవిగా మారాడు. దానికి కారణం మండుతున్న ఎండలే.

Read also: Fake constable: పోలీస్ అని నమ్మించింది.. ముగురిని ప్రేమలో ముంచింది

కౌటాల మండలం గుడ్ల బోరి గ్రామంలో పెళ్లి కొడుకు వడదెబ్బకు గురయ్యాడు. గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య, యశోద దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు గుండ్ల తిరుపతికి ఇటీవలే వివాహం జరిగింది. పెళ్లికూతురు మంచిర్యాల జిల్లా భీమిని గ్రామం. అయితే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే.. పెళ్లి పనులు మాత్రం తనే మొత్తం చూసుకుంటున్నాడు. దీంతో ఎక్కువగా బయట తిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో తిరుపతి సోమవారం వడదెబ్బ తగిలింది. దీంతో తిరుపతికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. తిరుపతి తీవ్రంగా నీరసించిపోయాడు. దీంతో తిరుపతి కుటుంబసభ్యులు కంగారు పడి చికిత్సకోసం వెంటనే కాగజ్ నగర్ కు తీసుకెళ్లారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయినా తిరుపతిలో పరిస్థితిలో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. దురదృష్టవశాత్తు తిరుపతి మాంచిర్యాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెల్లని బట్టలు కట్టుకుని పచ్చని పందిట్లో పెళ్లికొడుకులా కూర్చోవాల్సిన తిరుపతి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుపతి సోదరుడు శ్రీనివాస్ గ్రామ సర్పంచ్‌గా ఉంటూ ఆరు నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందాడు. పెళ్లికొడుకు మృత దేహాన్ని పచ్చని పందిట్లో పెట్టి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Aurangabad: చెప్పులు ఎత్తుకెళ్లాయని కుక్కలకు కు.ని ఆపరేషన్..