Bride Cancelled Her Marriage In Hyderabad For Dowry: అవును, మీరు చదివింది నిజమే! సాధారణంగా అదనపు కట్నం కోసం వరుడు తరఫు బంధువులు పెళ్లిళ్లు రద్దు చేసుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కానీ, ఇక్కడ రివర్స్‌లో వధువు పెళ్లి రద్దు చేసుకుంది. తమకిచ్చిన కట్నం సరిపోలేదంటూ.. ముహూర్తానికి గంట పెళ్లి క్యాన్సిల్ చేశారు వధువు తరఫు బంధువులు. చివరికి పోలీసులు రంగంలోకి దిగినా.. ఫలితం లేకుండా పోవడంతో, ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Lady Rowdy: యువకుడి హత్య కేసులో లేడీ రౌడీ హస్తం.. ఇన్‌స్టాలో రీల్స్.. పోలీసుల గాలింపు
పోచారం మునిసిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది. కట్నం విషయంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఒక విచిత్రమైన ఒప్పందం కుదిరింది. ఇక్కడ అబ్బాయి వారే అమ్మాయి తరఫు బంధువులకు ఎదురుకట్నం ఇచ్చేలా డీల్ చేసుకున్నారు. రూ.2 లక్షలు అమ్మాయికి కట్నం ఇచ్చేలా పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. మొదట్లో అమ్మాయి తరఫు బంధువులు ఇంకా ఎక్కువగానే డిమాండ్ చేశారు కానీ, చివరికి డీల్ రూ.2 లక్షలకు సెట్ అయ్యింది. నిన్న (గురువారం) రాత్రి 7:21 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.
KGF3: కేజీఎఫ్3 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పెద్ద స్కెచ్చే!
పెళ్లి కోసం వరుడి తరఫు బంధువులు కళ్యాణ మండపానికి ముహూర్తానికి గంట ముందే చేరుకున్నారు. కానీ.. వధువు తరఫు వారు రాలేదు. ముహూర్తం సమయంలోపు వస్తారనుకున్నారు. కానీ.. ముహూర్తం సమయం మించిపోతున్నా ఎవ్వరు రాలేదు. దీంతో.. వరుడి బంధువులు ఆరా తీస్తే, వధువు వారు ఊహించని షాకిచ్చారు. తమకు రూ.2 లక్షల కట్నం సరిపోదని, అదనంగా మరింత కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోక.. వరుడి తరఫు బంధువులు పోలీసుల్ని ఆశ్రయించారు. వాళ్లు మాట్లాడినా యువతి తరఫు వారు కట్నం విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో.. పెళ్లి రద్దయ్యింది. వధువుకు కట్నంగా ఇచ్చిన రూ. 2 లక్షలను కూడా వదులుకోవాల్సి వచ్చింది.