Bribed Mandal Revenue Officer Krishna Mohan Suspended.
సిద్దిపేట జిల్లా తొగుట తహశీల్దార్ కృష్ణ మోహన్ రిజిస్ట్రేషన్ కు వచ్చే రైతుల వద్ద తోచినంత లంచం తీసుకుంటుండంగా శుక్రవారం ఎన్టీవీ సీక్రెట్ గా చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన రైతులు అవాక్ అవుతున్నారు. వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటూ దాన్ని సంతోషంగా ఇచ్చారంటూ బిల్డప్ ఇవ్వడంతో తహశీల్దార్ తీరుపై పలువురు నవ్వుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే.. తాజాగా తొగుట ఎమ్మార్వో కృష్ణ మోహన్ ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. రైతుల భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు బహిరంగంగా డబ్బులు అడిగిన ఎమ్మార్వోకు సంబంధించిన అవినీతిపై ఎన్టీవీ వరుసగా కథనాల ప్రసారం చేయడంతో.. సదరు ఎమ్మార్వోను స్పస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
