అసలే వస్తున్నది రాంగ్ రూట్.. తనని పోలీసులు ఆపారని ఫ్రస్ట్రేషన్ కి లోనయ్యాడు. తన బండికి తనే నిప్పు పెట్టుకున్నాడు. అంతే… బైక్ పాక్షికంగా తగులబడింది. రాంగ్ రూట్లో వస్తున్న అశోక్ అనే వ్యక్తిని ఆపిన ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. బండి ఆపినందుకు ఆగ్రహంతో ఊగిపోయిన వాహనదారుడు.. కోపంతో పెట్రోల్ ట్యాంకును ఓపెన్ చేసి లైటర్ తో నిప్పంటించాడు అశోక్. ఆదిత్య ఎంక్లేవ్ లో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు ఈ వాహనదారుడు. నడిరోడ్డుపై బైక్ కి నిప్పంటించి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాడు. దీంతో కేసు బుక్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనం రేపింది.
Bp Next Level.. Bike Owner Frustration Live: పోలీసులు ఆపారని బైక్ కి నిప్పుపెట్టాడు

Maxresdefault (3)
