NTV Telugu Site icon

Love Affair: ఒకరితో లవ్ మరొకరితో ఎఫైర్.. ప్రియురాలు బర్త్ డే రోజే ప్రియుడు సూసైడ్

Slfi Susaid

Slfi Susaid

Love Affair: హన్మకొండ జిల్లా భీమదేరిపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందని వీడియోను రికార్డు చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనను మోసం చేసిన ప్రియురాలిని తన డెడ్ బాడీని చూపించాలని కోరిన తీరు అందరిని కలిచి వేసింది. ఈ ఘటన ముల్కనూర్ గ్రామంలో సంచలనంగా మారింది.

వీడియోలో మృతుడి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 17వ తేదీన హనుమకొండలోని జులైవాడకు చెందిన గిన్నె విష్ణువర్ధన్ అనే వ్యక్తి అమ్మాయి ఉండే జులైవాడకు నన్ను పిలిపించుకొని దారుణంగా కొట్టి, ఇబ్బందులకు గురిచేసి, బెదిరించారని తెలిపారు. అనంతరం హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా విష్ణువర్ధన్ ని, ఆ అమ్మాయిని కనీసం పిలిపించి పోలీసులు ఎంక్వయిరీ కూడా చేయలేదని బాధపడ్డాడు. ఆ అమ్మాయి, విష్ణువర్ధన్ తనని చాలా టార్చర్ చేశారని బాధపడ్డాడు. వారిద్దరు పెళ్లి చేసుకోవడం లేదని నువ్వే చేసుకో అని తనని నమ్మించి చివరి నిమిషంలో మోసం చేశారని కన్నీరుపెట్టుకున్నాడు. తన జీవితంతో ఆడుకున్నారని వారిని విడిచిపెట్టొద్దంటూ వీడియోలో తెలిపాడు. గత 4 నెలలుగా నాతో ఆడుకొని మెంటల్ గా, డిస్టర్బ్ చేసి చాలా టార్చర్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు సాయి చందన్‌.

నిన్న (మే 21న) శనివారం అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత అమ్మాయికి శుభాకాంక్షలు తెలిపి చనిపోతున్నట్లు సాయి వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటనతోనైనా ప్రతి సంవత్సరం ఆ అమ్మాయి పుట్టిన రోజున తన మరణాన్ని గుర్తు చేసుకోవాలని కోరాడు. అందుకే ఇప్పటి వరకు చనిపోవడం మానేశానని వీడియోలో చెప్పుకొచ్చాడు సాయి. తను చాలా ఆలోచించానని, అమ్మ, నాన్న, చెల్లి, బావ, నా స్నేహితులందరూ క్షమించాలని కోరాడు. చావు తప్ప నాకు వేరే మార్గం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ అమ్మాయి దూరమైన బాధ తట్టుకోలేక ఈపని చేస్తున్నానని సాయి తెలిపారు. మీ ప్రేమ, స్నేహం మిస్ అవుతున్నా అంటూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా డెడ్ బాడీని చూపించాలని, ఇదే నా చివరి కోరిక అని వీడియోలో చెప్పాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ముల్కనూర్ ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.
Four months time: నాలుగు నెలలు టైం ఉంది.. రూ.2వేల నోట్లు మార్చేందుకు టెన్షన్ ఎందుకు