NTV Telugu Site icon

Rathod Bapu Rao: 20న బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తా…21 న కాంగ్రెస్‌లో చేరుతా

Rathod Bapu Rao

Rathod Bapu Rao

Rathod Bapu Rao: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోవైపు పార్టీ ఫిరాయించే వారి సంఖ్య పెరుగుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియా ముఖంగా వెల్లడించారు.

బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 20వ తేదీన బీ ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని.. ఢిల్లీలో 21న కాంగ్రెస్ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ట్రైబల్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వపోవడంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు ఓడిపోయిన వాళ్లకు, అమెరికానుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చారంటే.. బీఆర్ఎస్ కు గిరిజనుల మీదున్న ప్రేమ ఏంటో అర్థం చేసుకోవాలని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది.. అందుకే పార్టీ మారుతున్నానని స్పష్టం చేశారు. 56 రోజులు వేచి చూసినా.. అయినా లాభం లేదు..అందుకే పార్టీ మారుతున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రాకుండా కొంత మంది అడ్డుకున్నారు.. కుట్రలు చేసారని మండిపడ్డారు. నాది క్లీన్ ఇమేజీ.. ఒక్క కేసు కూడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పై కొంత మంది దొంగలు వివిధ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లను మా కార్యకర్తలు బట్టలిప్పి కొడుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తది.. మరో సారి పోటీ చేసి గెలిచి తిరుతా అని రథోడ్ బాపురావు స్పష్టం చేశారు.
Scott Edwards: భారీ అంచనాలతో వచ్చాం.. మరిన్ని షాక్‌లు ఇస్తాం: నెదర్లాండ్స్‌ కెప్టెన్‌