Bomb Threat Phone Call to Krishna Express Rail: బాంబు బెదిరింపు కాల్ హైదరాబాద్ లో తీవ్ర కలకలం సృష్టించింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందన్న ఫేక్ ఫోన్ కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. దీంతో వెంటనే పోలీసులు సికింద్రాబాద్ చేరుకోనున్న కృష్ణ ఎక్స్ప్రెస్ మౌలాలిలో ఆపి తనికీలు నిర్వహించారు. అప్పటికే స్టేషన్‌లో సిద్ధంగా ఉన్న బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు ప్రారంభించారు. బాంబు బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా పెద్దఎత్తున పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది మోహరించారు. పదో నెంబర్ ఫ్లాట్ ఫారమ్ వద్ద కూడా తనిఖీలు నిర్వహించారు. మౌలాలి వద్ద రైల్‌ను డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత.. ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. అనంతరం కృష్ణా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ చేరుకుంది. ఈ బాంబు బెదిరింపు కాల్ వల్ల 2 గంటల ఆలస్యంగా కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆదిలాబాద్ బయలు దేరింది. బాంబ్ లేదని తేలాగా కాల్ చేసిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చివరికి రైల్ లోనే ఉన్న కిరణ్ ను అదువులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఫేక్ కాల్ చేసిన వ్యక్తి కిరణ్ అనే యువకున్ని అదుపులోకి తీసుకొని రైల్వే పోలీసులు ప్రశ్నించగా ఆశక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సై పరీక్షల్లో ఫెయిల్ అయిన కిరన్ అనే నిరుద్యోగి మానసికంగా కృంగిపోయాడు. డిసెంబర్ మాసంలో ఎస్సై ఈవెంట్స్ లో ఫెయిల్ అయిన నాటి నుంచి కిరణ్ అలాగే ప్రవర్తిస్తున్నాడని, తలకు గాయం కావడంతో మతిస్థిమితం కోల్పోయాడని, మానసిక స్థితి సరిగా లేదని అతని తండ్రి తెలియజేయడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. రైల్లో భువనగిరి నుంచి వస్తూ బాత్రూంలోకి వెళ్లి కృష్ణ ఎక్స్ప్రెస్ లో బాంబు ఉందంటూ 100కు డయల్ చేసి చెప్పాడు. అయితే రైల్లో జనాలు అధికంగా ఉన్నది చూసి వాళ్లంతా టెర్రరిస్టులు గాని భావించి ఫోన్ చేశానని పోలీసులకు తెలియజేశాడు కిరణ్.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
దేశంలో సెక్యూరిటీ ఏజెన్సీలు, బలగాలు హైఅలెర్ట్ లో ఉన్నాయి. రిపబ్లిక్ డే నాడు ఎలాంటి ఉగ్రవాదుల దాడులు జరగకుండా.. చర్యలు చేపడతున్నాయి. ఇక హైదరాబాద్ లో రిపబ్లిక్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్న సిబ్బందికి ఈఫేక్ ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపింది. రిపబ్లిక్ డే కు ఇక ఐదురోజులే ఉండటంతో.. నగరంలో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. అయితే.. ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చిన దాఖలాలున్నాయి. నగరంలోని చార్మినార్ దగ్గర బాంబు పెట్టామంటూ కాల్స్ చేసి బెదిరించారు. అయితే ఫోన్ ఆ కాల్స్‌తో అప్రమత్తమైన సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. చివరికి అది ఆకతాయి ఫోన్‌కాల్‌గా తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఆకతాయిల ఫోన్ కాల్ అని అనుమానం వచ్చిన సిబ్బంది వాళ్ల జాగ్రత్తలో వాళ్లు ఉండాల్సిందే.
Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన జోయ్ అలుక్కాస్ అధినేత