రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో నిత్యం రక్తం ఎక్కించుకుంటున్న తలసేమియాతో బాధపడుతున్న బాలుడికి హెచ్ ఐవీ (HIV Infection) సోకడం కలకలం రేపుతోంది. రక్తం ఎక్కించిన బాలుడికి హెచ్ ఐ వి పాజిటివ్ నిర్ధారణ కావడంతో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గతంలో లేని వైరస్ తేలడంతో బాలుడి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా రాంపల్లి గ్రామానికి చెందిన బి.శివకు 2017లో పెళ్లయింది. ఆదంపతులకు బాబు పుట్టాడు.
ఆ బాబుకు 3 ఏళ్లు. అయితే ఆ బాలుడు పుట్టుకతోనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. డాక్టర్ల సూచనతో రక్తం ఎక్కించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నల్లకుంట పరిధిలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ను ఎంపిక చేసుకొని రెండున్నర సంవత్సరాలుగా రక్తం ఎక్కిస్తూనే ఉన్నారు. ప్రతి 15 రోజులకోసారి బ్లడ్ ఎక్కిస్తున్నారు. ఇటీవల జూలై 20న కూడా బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ చేశారు. ఆ తర్వాత డాక్టర్ సలహాతో బ్లడ్ టెస్ట్ చేస్తే హెచ్ఐవీ నిర్ధారణ అయింది.
Hyderabad Rains : హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..
దీనిపై పూర్తి దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు వైద్య నిపుణుల సలహా తో పాటు న్యాయ సలహా తీసుకుంటున్నారు పోలీసులు. బ్లడ్ బ్యాంక్ ద్వారా హెచ్ ఐ వి ఎలా సోకిందో లేదో పరిశోధిస్తున్నారు.
