Site icon NTV Telugu

MLA’s Purchase Case: వెలుగులోకి బీఎల్ సంతోష్, రామచంద్ర భారతి వాట్సాప్ చాట్

Mla's Purchase Case

Mla's Purchase Case

MLA’s Purchase Case: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. అధికారులకు దిమ్మతిరిగే నిజాలు బయటకు వస్తుండటంతో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పుడు మళ్లీ వాట్సప్‌ చాట్‌ బయటకు రావడంతో ఉల్కంఠంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి, బీఎల్ సంతోష్ కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు వెలుగు చూశాయి. రామచంద్ర భారతి ముగ్గురు వ్యక్తులను మీకు పరిచయం చేయాలని సంతోష్ కు మెసేజ్ చేయగా.. వీరిలో ఏకే సింగ్ ఓకే, ఆర్.వశిష్ఠ గురించి డీహెచ్ చర్చించాలని సంతోష్ రిప్లై ఇచ్చారు. వీకే సింగ్ గురించి సందీప్ కు చెప్పమంటూ రామచంద్ర భారతి కోరారు. ఇది ఆగస్టు 2021 నుండి వారిద్దరి మధ్య వాట్సాప్ చాట్‌లను, ఏప్రిల్ 11, 2022 న హరిద్వార్‌లో తీయబడిన వారి చిత్రాన్ని రూపొందించింది. ఎమ్మెల్యేలకు సంబంధించిన అప్‌డేట్ ఇస్తూ అక్టోబర్ 26న బిఎల్ సంతోష్‌కు రామచంద్ర భారతి పంపిన సందేశం కూడా భాగమని సిట్ తెలిపింది.

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసుపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. రామచంద్ర భారతి, నంద కుమార్‌, సింహయాజులు దగ్గర నుంచి రాబట్టి వివరాలు.. వారి సెల్‌ఫోన్‌ డాటా ఆధారంగా పలువురుకి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. అయితే.. తాజాగా నేడు విచారణలో సిట్ తరపున లాయర్ దువే వాదనలు వినిపించారు. కుట్రలు బయటపడడంతోనే బీజేపీ ఆందోళన చెందుతోందని దువే హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంటే ఊరుకుంటారా? ఇలా కొనుగోళ్లు జరుగుతూపోతుంటే ప్రజాస్వామ్యం ఖూనీ కాదా.. తప్పు చెయ్యకపోతే సిట్ దర్యాప్తు ను ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారని దువే అన్నారు. ప్రతిపక్ష నేతలను ఈడీ, ఐటీ చేత దాడులు చేయిస్తుందని దువే హైకోర్టుకు వివరించారు.

Read also: Face Recognition : నేటి నుంచి విద్యార్థులకు ఫేస్‌ అటెండెన్స్‌ అమలు

అరెస్ట్ అయిన నిందితులకు బీజేపీ అధినేతలకు నేరుగా సంబంధాలు ఉన్నాయని దువే హైకోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై పక్కా ఆధారాలు ఉన్నాయని దువే ఉద్ఘాటించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రమాదంలో పడుతుందని తెలిసినప్పుడు… ఆ పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా ఆయన ప్రజల ముందుకు తీసుకెళ్లడం తప్పేలా అవుతుందన్నారు దువే. ప్రజల్లోకి ఈ కొనుగోలు వ్యవహారం తీసుకెళ్లడం సీఎం హక్కు అని దువే హైకోర్టుకు వివరించారు. సిట్ చీఫ్ సీవీ ఆనంద్ కు 5 ఏళ్ల సర్వీస్ ఉందని, ఢిల్లీ కేంద్రంగా ఐపీఎస్‌ అధికారి పనిచేస్తారన్నారు. దేశంలో ఎక్కడైనా పనిచెయ్యాల్సి ఉంటుందని, సీవీ ఆనంద్ స్వతంత్రంగా పనిచేస్తారు.. ఆయన ఎవరి ఒత్తిళ్లకు లొంగట్లేదని దువే న్యాయస్థానానికి వెల్లడించారు. అయితే.. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు విచారణ మంగళవారానికి (డిసెంబర్‌ 6)కు వాయిదా వేసింది.
Virat Kohli: విరాట్ కోహ్లీ సిక్స్‌పై పెదవి విప్పిన పాక్ బౌలర్ హారీస్ రౌఫ్..

Exit mobile version