Site icon NTV Telugu

BJP Protest: బండి సంజయ్‌ అర్థరాత్రి అరెస్ట్‌.. రాష్ట్రవ్యాప్త నిరసనకు బీజేపీ పిలుపు

Bjp Protect

Bjp Protect

BJP Protest: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అరెస్ట్‌ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికత్త నెలకొంది. సంజయ్‌ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తు్న్నారు. బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పిలుపు నిచ్చారు. బండి సంజయ్ కుమార్ ని అర్ధరాత్రి అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తూ అన్ని మండల జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పైన సీఎం కేసీఆర్‌ కుటుంబం పైన.. లీకేజీ ప్యాకేజీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెల్లుతుండడంతో దాని పక్కదారి పట్టించడానికి బండి సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేసి ఇప్పుడు కారణాలు వెతుకుతున్నారని మండిపడుతున్నారు.

Read also: London School of Economics: భారత్, హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం.. ఓ ఇండియన్ స్టూడెంట్ ఆవేదన

ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరీక్ష పత్రాలు లీకేజీల అవుతుండడం, మరోవైపు బీఆర్ఎస్ పేరుతో దేశవ్యాప్తంగా బీజేపీ యేతర అన్ని రాజకీయ పార్టీలకు ఫైనాన్స్ అందిస్తామని, తనను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలని కేసీఆర్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబం దగ్గర లక్షల కోట్ల రూపాయల ప్రజా ప్రజాధనం దోపిడీ చేశారన్న భావన ప్రజల్లో కలుగుతుండడంతో దాన్ని పక్కదారి పట్టించాలానే దుర్మార్గపు ఆలోచనతోనే బండి సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగిందని ఆరోపించారు. బండి సంజయ్ కుమార్ ను కారణం లేకుండా అరెస్టు చేసి ఇప్పుడు కారణాలు వెతుకుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతూ బండి సంజయ్ కుమార్ ను బేషరత్ గా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
LIC’s Superhit Policy : 4ఏళ్లు డబ్బు డిపాజిట్ చేయండి.. రూ.కోటి సొంతం చేసుకోండి

Exit mobile version