బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. హనుమకొండలో ఆగస్టు 27న బీజేపీ నిర్వహించతలపెట్టిన సభకు అనుమతి సభ నిర్వహణకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి నిరాకరించారు. పోలీసుల నుంచి సమాచారం లేనందున సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు BJP జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకావాల్సి ఉంది. చివరి నిమిషంలో సభకు అనుమతి రద్దవడంతో బీజేపీ సందిగ్ధంలో పడింది. దీనికి సీరియస్ గా తీసుకున్న బీజేపీ శ్రేణులు దీనిపై కోర్ట్ కు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రేపు ప్రజాసంగ్రామ యాత్ర భారీ బహిరంగ సభచేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. కావాలనే సభకు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే.. మధ్యాహ్నం 1.15కి సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణకు అంగీకరించింది.
అయితే బండి సంజయ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న విషం తెలిసిందే. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడంతో.. బండిసంజయ్, బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎప్పుడూ లేని ఇవాళ ఎందుకు పాదయాత్రను అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పాద్రయాత్ర అడ్డుకుంటే ఊరుకోమని, ఇది ప్రభుత్వం కక్ష్యపూరితంగానే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చేంతవరకు దీక్ష చేపడతానని కరీంనగర్ ఆయన ఇంటి వద్దనే దీక్ష చేపట్టారు. పాదయాత్రకు అనుమతించాలని డిమాండ్ చేశారు. దీంతో బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రాయ యాత్రకు హైకోర్టు నుంచి అనుమతి లభించింది. యాత్ర నిలిపివేయాలని పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని కొట్టివేసింది. నేటి నుంచి యాత్రను తిరిగి ప్రారంమైంది. మూడు రోజులు జరిగిన జాప్యం కారణంగా, పాదయాత్రను కుదించాలని నిర్ణయించుకున్నారు. నేడు, రేపు కలుపుకొని మొత్తం 30 కి.మీ. పాదయాత్రతో ఈ యాత్రను ముగించాలని డిసైడ్ అయ్యారు. ఆగిన చోట నుండే పాదయాత్ర ప్రారంభమైంది. రోజుకు 20 కి.మీ.లకు పైగా నడిచేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారని బీజేపీ నేతలు అన్నారు.
ఇవాళ స్టేషన్ ఘనపురం నియోజకవర్గం, ఉప్పుగల్ సమీపంలోని పాదయాత్ర శిబిరం నుంచి ప్రారంభమైంది. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా నాగాపురం వరకు కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ నాగాపురం సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. ఈనెల 27న మధ్యాహ్నం వరకు ఈ యాత్ర సాగుతుంది.
అయితే.. రేపు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగే బహిరంగ సభ ప్రశ్నార్థకంగా మారింది. 27న జరిగే బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తల సన్నాహాలు చేస్తున్న తరుణంలో.. హనుమకొండలో ఆగస్టు 27న బీజేపీ నిర్వహించతలపెట్టిన సభకు అనుమతి సభ నిర్వహణకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి నిరాకరించడంపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది. పోలీసుల నుంచి సమాచారం లేనందున సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చివరి నిమిషంలో సభకు అనుమతి రద్దవడంతో బీజేపీ సందిగ్ధంలో పడింది. దీనికి సీరియస్ గా తీసుకున్న బీజేపీ శ్రేణులు ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ సభకు BJP జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకావాల్సి ఉంది. మరి దీనిపై బీజేపీ పిటిషన్ పై హైకోర్టు ఎలా స్పందించనుంది ప్రశ్నలు తలెత్తుతున్నాయి? ఏర్పాట్లుకు ఎక్కువ సమయం కూడా లేకపోవడంపై బీజేపీకి పెద్ద సమస్యగా మారింది. రేపు జరగబోయే సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Ghulam Nabi Azad: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్
