Site icon NTV Telugu

Etela Rajender: ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.. రేవంత్ ఖబర్దార్..!

Etala Rajender

Etala Rajender

Etela Rajender: సీఎం రేవంత్ రెడ్డి నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, ఖబర్దార్ అంటూ మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేసి చేస్తున్న వసూళ్ళ చిట్టా రికార్డ్ అవుతుందన్నారు. ఈమధ్య కాలంలో నడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్ నెలరోజుల్లోనే రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీ మా పెద్దన్న, ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుంది అని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొంపల్లి, అల్వాల్ ఫ్లై ఓవర్ కోసం 175 ఎకరాల రక్షణ రంగ భూమిని కేటాయించారు అని చెప్పిన సీఎం.. మళ్లీ మోదీ ఎంది అనిమాట్లడుతున్నారు. కేసీఆర్ కూడా అలానే మాట్లాడారు. ఆయనకు పట్టిన గతే మీకు పడుతుందని మండిపడ్డారు. నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో.. అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కేసీఆర్ ఫోన్ టాపింగ్ చేస్తున్నారని విమర్శించిన వీరు.. కూడా ఫోన్ టాపింగ్ చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. అప్రజాస్వామికం వ్యవహరిస్తే ఖబర్థార్ అన్నారు.

Read also: MP Sanjay Raut : కాంగ్రెస్ లేకుంటేస్వాతంత్య్రం వచ్చేది కాదు.. బీజేపీ లేకుంటే అల్లర్లు జరిగేవి కావు : సంజయ్ రౌత్

పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తుల ఎంత వేదిస్తున్నది.. ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నది రికార్డ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఒక్క రాష్ట్రంలో ఉండి నేనే అన్నీ అనుకుంటున్నావు.. నిన్ను వీక్షించే వారు కూడా ఉన్నారని మర్చిపోకు రేవంత్ అన్నారు. మల్కాజిగిరిలో ఎవరు వచ్చిన ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టిన గెలిచేది బీజేపీనే.. అని ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందని అన్నారు. మోడీ ఏనాడు అలవికాని హామీలు ఇవ్వలేదన్నారు. దేశచరిత్రలో ఎక్కడా లేనన్ని హామీలు ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిందని తెలిపారు. మా పాలన నచ్చితే 370 సీట్లు ఇవ్వాలని, NDA కి చార్ సౌ పార్ అందించాలని మోడీ కోరుతున్నారని అన్నారు. ఎంత మెజారిటీ వచ్చినా తోడుగా వచ్చిన పార్టీలను మాత్రం వదిలిపెట్టడం లేదు.. కొంతమంది ఒడ్డు ఎక్కాక బొడ మల్లన్న అని వదిలివేస్తారు కానీ కష్టకాలంలో అండగా ఉన్న వారిని వదిలిపెట్టలేదన్నారు.
Revanth Reddy: కేసీఆర్ గంజాయి మొక్కలు నాటారు.. వాటిని పీకి పడేస్తా..

Exit mobile version