Site icon NTV Telugu

ఆ పోటీ పెడితే కేసీఆర్, కేటీఆర్ లే ముందుంటారు…

మంత్రి కేటీఆర్ ట్వీట్ కి రాజా సింగ్ కౌంటర్ వేశారు. ట్విట్టర్ లోనే భోజనం చేసి అందులోనే పడుకునే కేటీఆర్ ఆరు రోజుల తర్వాత నా ట్వీట్ కి రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న కెసిఆర్ ని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. పెట్రోల్ డీజిల్ లో కేంద్రం వాటా ఎంత రాష్ట్రం వాటా ఎంత కేటీఆర్ అని… అబద్ధాలు తప్ప నిజం చెప్పవా అని ప్రశ్నించారు. పెట్రోల్ మీద 41 రూపాయలు తీసుకుంటుంది వాస్తవం కాదా… తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే 41 రూపాయలను తీసుకోకు. అబద్ధాల పై పోటీ పెడితే కేసీఆర్, కేటీఆర్ లే ముందుంటారు అన్నారు. ఇక పాతబస్తీలో ఇద్దరం కలిసి తిరుగుదాం కేటీఆర్ నువ్వు ఒక గంట తిరిగితే బ్యాక్ పెయిన్ వస్తుంది అని పేర్కొన్నారు.

Exit mobile version