NTV Telugu Site icon

Nandeshwar Goud: మహిపాల్ రెడ్డి నీ అంతు చూస్తా.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వార్నింగ్..

Nandeshwar Goud

Nandeshwar Goud

Nandeshwar Goud: మహిపాల్ రెడ్డి అనవసరంగా పోలీసులను మాపై ఊసిగొల్పితే సహించేది లేదని, మహిపాల్ రెడ్డి నీ అంతు చూస్తా అని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ నివాసం వద్ద మాట్లాడుతూ.. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చాట్ పూజకు పోలీసులు అనుమతి నిరాకరించారని మండిపడ్డారు. బీజేపీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అపహాస్యం చేస్తున్నారనిద అన్నారు. పటాన్ చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి ఎన్నికలలో పంచేందుకు 30కోట్ల రూపాయలు డంప్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇదే మైత్రిలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఛాట్ పూజకు ఎలా పర్మిషన్ ఇచ్చారని మాకెందుకు ఇవ్వరని మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ కు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐని వెంటనే ఇక్కడ నుంచి మార్చాలని.. వారిపై ఉన్నతాధికారులకు, గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి ప్రజల నుంచి దోచుకున్న డబ్బులతో పోలీసులును, వ్యవస్థ లనూ మేనేజ్ చేద్దామనుకోవటం సమంజసం కాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహిపాల్ రెడ్డికి రాజకీయ బిక్ష పెట్టింది నేనని అన్నారు. ఈ సారి 100, కోట్లు పెట్టినా మహిపాల్ రెడ్డి గెలవడని సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయానికి, అధర్మానికి జరుగుతున్న సంగ్రామం ఇది అన్నారు. సుప్రీం కోర్టు లో మహిపాల్ రెడ్డి పై ఇంకా కేసు నడుస్తోందని అన్నారు. మహిపాల్ రెడ్డి అనవసరంగా పోలీసులను మాపై ఊసిగొల్పితే సహించేది లేదు. నీ అంతు చూస్తా అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తను డబ్బులిస్తే మహిపాల్ రెడ్డి తన జేబుకు టైర్లు వేయించుకున్నాడని అన్నారు. నీ వాహనం పోతే రెండు లక్షలు ఇచ్చాను.. గత చరిత్ర మర్చిపోకూడదని తెలిపారు.

నా ప్రాణం పోయినా మహిపాల్ రెడ్డి ని వదలేది లేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహిపాల్ రెడ్డి ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నడని మండిపడ్డారు. హిందుత్వ వ్యతిరేకి మహిపాల్ రెడ్డి అని ఆగ్రహం వ్యకతం చేశారు. బహిరంగంగా పటాన్ చెరు రోడ్డుపై గోమాంసం అమ్మేస్తున్నారని, దుకాణదారుల నుంచి ఎమ్మెల్యే తమ్ముడు కిరాయి వసూలు చేస్తాడని కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవాలయాలను కబ్జాచేసి అమ్మేస్తున్నారని మండిపడ్డారు. చర్చిలకు, మసీదులకు ఇచ్చిన ప్రాధాన్యత హిందూ దేవాలయాలకు ఇవ్వటం లేదని అన్నారు. ప్రజలు మహిపాల్ రెడ్డికి రాజకీయంగా కర్రుకాల్చి వాతపెడతారని అన్నారు. ఒకప్పుడు రౌడిగా ఉన్న మహిపాల్ రెడ్డి పై లేని బైండోవర్ కేసులు బీజేపీ వారిపై ఎందుకు? అని ప్రశ్నించారు. గో మాంసం దుకాణాలను రేపటి లోపుగా తీసేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్న డిఎస్పీ, సీఐని తక్షణమే తీసేయాలని డిమాండ్ చేశారు.
ChatGPT in Telugu: తెలుగులో చాట్ జీపీటీ.. ఈజీగా టెక్స్ట్‌, వాయిస్‌ కమాండ్స్‌