NTV Telugu Site icon

BJP MLA: టికెట్‌ కొనకపోతే బిచ్చమెత్తుకున్నట్లే.. మహిళల ఫ్రీ బస్ జర్నీపై బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్..!

Katipally Venkata Ramana

Katipally Venkata Ramana

BJP MLA: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఆరు హామీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ప్రయాణించే సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఒకసారి రూ. గతంలో 12 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా, ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 30 లక్షలకు చేరుకుంది. మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉపయోగపడుతుందని.. దీని ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందన్నారు. ఇది విపరీతమైన ఖర్చు అని మరికొందరు అంటున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై భారం పడి ప్రజల నుంచి వివిధ రూపాల్లో వసూలు చేయనున్నారు.

Read also: Adala Prabhakar Reddy: పార్టీ మారే ప్రసక్తే లేదు.. నెల్లూరు రూరల్‌ నుంచి పోటీ..

అయితే.. ఉచిత బస్సుయాత్రపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెలకు రూ.10 వేల ఆదాయం ఉన్నా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారంటే అలాంటి మహిళలు తన దృష్టిలో బిచ్చగాళ్లలాంటి వారని అన్నారు. తమకు ఆదాయం, ఆస్తులు ఉన్నా పింఛన్, రైతు పెట్టుబడి సాయం, రేషన్ కార్డు తీసుకున్నా అందరూ బిచ్చగాళ్లేనని అన్నారు. అంతేకాకుండా.. ఉచితం కావాలనుకునే వారికి ఉండాలి కానీ.. మీరు చెల్లించే సామర్థ్యం రూ. 10 వేలు సంపాదించి కూడా ఉచిత బస్సు ప్రయాణం వాడుకుంటే.. నా దృష్టిలో అడుక్కుంటున్నట్టే అన్నారు. మీకు భగవంతుడు చిన్న చూపుచూసి గుడికాడ ఉండి అమ్మా.. అయ్యా అంటూ అడుక్కుంటారు చూశారా వాళ్లలాగే మీరు కూడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గరీబోళ్ల డబ్బే కదా. అలాగే ఆదాయం ఉండి కూడా పెన్షన్ తీసుకున్నా.. రైతు బంధు తీసుకున్నా.. బిచ్చమెత్తుకున్నట్లే అంటూ మహిళల పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ దగ్గర కక్కుర్తి పడేటోళ్ల శవాల మీద పేలాలు ఏరుకునేటోళ్లు. తినటానికి తిండి లేకుంటే ఏరుకున్నట్లే అని కాటిపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘వెల్ సేడ్ ఎమ్మెల్యే’ అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తుంటే.. ‘నెలకు రెండున్నర లక్షలకు పైగా జీతం తీసుకుంటూ ప్రభుత్వ వాహనాన్ని వాడడం కూడా సేమ్’ అని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Rajendra Nagar: బాలాపూర్ లో దారుణం.. రౌడిషీటర్ పై కత్తులతో దాడి.. హత్య