BJP MLA: టికెట్ కొనకపోతే బిచ్చమెత్తుకున్నట్లే.. మహిళల ఫ్రీ బస్ జర్నీపై బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఆరు హామీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ప్రయాణించే సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఒకసారి రూ. గతంలో 12 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా, ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 30 లక్షలకు చేరుకుంది. మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉపయోగపడుతుందని.. దీని ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందన్నారు. ఇది విపరీతమైన ఖర్చు అని మరికొందరు అంటున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై భారం పడి ప్రజల నుంచి వివిధ రూపాల్లో వసూలు చేయనున్నారు.
Read also: Adala Prabhakar Reddy: పార్టీ మారే ప్రసక్తే లేదు.. నెల్లూరు రూరల్ నుంచి పోటీ..
Also Read
అయితే.. ఉచిత బస్సుయాత్రపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెలకు రూ.10 వేల ఆదాయం ఉన్నా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారంటే అలాంటి మహిళలు తన దృష్టిలో బిచ్చగాళ్లలాంటి వారని అన్నారు. తమకు ఆదాయం, ఆస్తులు ఉన్నా పింఛన్, రైతు పెట్టుబడి సాయం, రేషన్ కార్డు తీసుకున్నా అందరూ బిచ్చగాళ్లేనని అన్నారు. అంతేకాకుండా.. ఉచితం కావాలనుకునే వారికి ఉండాలి కానీ.. మీరు చెల్లించే సామర్థ్యం రూ. 10 వేలు సంపాదించి కూడా ఉచిత బస్సు ప్రయాణం వాడుకుంటే.. నా దృష్టిలో అడుక్కుంటున్నట్టే అన్నారు. మీకు భగవంతుడు చిన్న చూపుచూసి గుడికాడ ఉండి అమ్మా.. అయ్యా అంటూ అడుక్కుంటారు చూశారా వాళ్లలాగే మీరు కూడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గరీబోళ్ల డబ్బే కదా. అలాగే ఆదాయం ఉండి కూడా పెన్షన్ తీసుకున్నా.. రైతు బంధు తీసుకున్నా.. బిచ్చమెత్తుకున్నట్లే అంటూ మహిళల పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ దగ్గర కక్కుర్తి పడేటోళ్ల శవాల మీద పేలాలు ఏరుకునేటోళ్లు. తినటానికి తిండి లేకుంటే ఏరుకున్నట్లే అని కాటిపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘వెల్ సేడ్ ఎమ్మెల్యే’ అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తుంటే.. ‘నెలకు రెండున్నర లక్షలకు పైగా జీతం తీసుకుంటూ ప్రభుత్వ వాహనాన్ని వాడడం కూడా సేమ్’ అని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Rajendra Nagar: బాలాపూర్ లో దారుణం.. రౌడిషీటర్ పై కత్తులతో దాడి.. హత్య
తాజావార్తలు
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!