NTV Telugu Site icon

BJP Leader Prakash Reddy: పేపర్ లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ.. కేటీఆర్ రాజీనామా చేయాలి

Bjp Prakash Reddy

Bjp Prakash Reddy

BJP Leader Prakash Reddy Demands KTR To Resign His Ministry Over TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్‌కు పూర్తి బాధ్యత వహిస్తూ.. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదని.. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. మంత్రి కిషన్‌రెడ్డితో బండి సంజయ్ గుళ్లకు వెళ్లినప్పుడు.. రాజశేఖర్ రెడ్డి (పేపర్ లీకేజ్‌లో నిందితుడు) అనే ఫోటో వ్యక్తి దిగాడని వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నట్టు.. రాజశేఖర్‌రెడ్డి బీజేపీ కార్యకర్త కాదని, అసలు తమ పార్టీతో అతనికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాజశేఖర్‌రెడ్డి ఎవరనేది ప్రభుత్వమే తేల్చాలని కోరారు.

Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీ పొడగింపు

గతంలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపించిన ప్రకాష్ రెడ్డి.. ఈ విషయాన్ని తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. ఈరోజు పేపర్ లీకవ్వడంతో టీఎస్‌పీఎస్‌సీ అభాసుపాలు అయ్యిందన్నారు. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీఎం కేసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ లీకేజ్‌ని కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సిట్‌తో ఫలితం రాదని చెప్పిన ఆయన.. ఇప్పటివరకు టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పరీక్షల మీద సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసుల ఓవర్ యాక్షన్‌తోనే సంజయ్ అరెస్ట్‌ని అరెస్ట్ చేశారని, బీజేపీ నేతల అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ కార్యకర్తల మీద దురుసుగా ప్రవర్తించిన ఆసిఫ్ నగర్ సీఐను సస్పెండ్ చేయాలని కోరారు.

MLA Seethakka: పేపర్ లీకేజ్‌లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది.. సీతక్క సంచలన వ్యాఖ్యలు

అటు.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్ ఘటనపై గన్‌పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన బండి సంజయ్, ఈటల రాజేందర్ అరెస్ట్‌లను ఖండిస్తూ డీకే అరుణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆ ఇద్దరిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించిన ఆమె.. తమ నాయకులతో, ముఖ్యంగా మహిళలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఇది దౌర్భాగ్యమని మండిపడ్డారు. తమ సహనాన్ని చేతగానితనంగా అనుకోవద్దని హెచ్చరించారు.

Show comments