Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp Huzurabad Mla Eatala Rajender Father Passes Way

Eatala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఇంట విషాదం.. అనారోగ్యంతో తండ్రి మృతి

Published Date :August 24, 2022 , 9:36 am
By NTV WebDesk
Eatala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఇంట విషాదం.. అనారోగ్యంతో తండ్రి మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

bjp huzurabad mla eatala rajender father passes way: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఈటల మల్లయ్య అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వృద్ధాప్య సమస్యలతో చాలా రోజులుగా ఈటల మల్లయ్య బాధపడుతున్నారు. దీంతో తండ్రిని, కుమారుడు ఈటల రాజేందర్ హైదరాబాద్‌ లోని ఆర్వీఎం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయినా.. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో నిన్న మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు. తండ్రి మల్లయ్య మరణవార్తను ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

నిన్న మంగళవారం అర్ధరాత్రి ఆయన భౌతిక కాయాన్ని హనుమకొండ జిల్లా కమలాపూర్‌లని ఈటల స్వగృహానికి తరలించారు. నేడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఈటల కుటుంబీకులు తెలిపారు. తండ్రి ఈటల మల్లయ్యకు మొత్తం ఎనిమిది మంది సంతానం.. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. కాగా.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెండో కుమారుడు.. ఈటల మల్లయ్య మృతితో కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈటెల మల్లయ్యను కడసారి చూసేందుకు.. ఈటలను పరామర్శించేందుకు బీజేపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.

మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఈటల రాజేందర్ బిజీబిజీగా ఉన్నారు. దీంతో కొన్ని రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇక బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ హోదాలో వలసలపై సీరియస్‌గా దృష్టిసారించారు.. కలిసి వచ్చే వారందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈనేపథ్యంలో.. ఈటల రాజేందర్ భార్య జమున స్వగ్రామం మునుగోడు నియోజకవర్గంలోనే ఉండడంతో ఆయన అక్కడే స్వయంగా అక్కడే ఉండి.. ఉపఎన్నికల కోసం పనిచేస్తున్నారు. ఇక తండ్రి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో నిన్న మంగళవారం అంతా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న (మంగళవారం) రాత్రి తన తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వెళ్లి.. అంత్యక్రియలు నుంచి దశదిన కర్మ వరకు అక్కడే ఉండనున్నారు. అనంతరం.. ఆ తర్వాతే మళ్లీ రాజకీయపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.
Bihar Politics: నేడు నితీష్ కుమార్ సర్కార్ బలనిరూపణ పరీక్ష

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • eatala Rajender father age
  • eatala Rajender father death news
  • eatala Rajender father passes away
  • eatala Rajender latest news

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions