NTV Telugu Site icon

MLC Kavitha: హ్యాపీ బర్త్‌డే బావా.. ఆప్యాయంగా విష్ చేస్తూ కవిత ట్వీట్‌

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: నేడు తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియాలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అభిమానులు హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రి హరీశ్‌కు సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తన బావ అయిన మంత్రి హరీశ్‌ రావుకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయంగా విష్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి గతంలో జరిగిన ఓ ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోను ఎమ్మెల్సీ కవిత షేర్ చేశారు. కవిత షేర్ చేసిన ఫోటోను పలువురు రీట్వీట్ చేస్తున్నారు.

అక రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజున, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో జనపనార విత్తనాలను నాటాలని సూచించారు. పర్యావరణ ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ చిరు కార్యక్రమంలో పాల్గొనాలని సంతోష్ విజ్ఞప్తి చేశారు. మంత్రి హరీశ్ రావుతో కలసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను ట్వీట్ చేశారు.

గొప్ప నాయకుడు, మంత్రి తన్నీరు హరీష్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ చామకూర మల్లారెడ్డి ట్వీట్ చేశారు. ప్రియతమ నాయకుడు మంత్రి హరీష్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఉన్న ఫోటోను షేర్ చేశారు.

బీఆర్‌ఎస్ పార్టీ తరపున కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆయన అభిమానులు, అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే హరీశన్న’ అనే ట్యాగ్‌లైన్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రతి ఒక్కరు హ్యాపీ బర్త్‌డే హరీశ్‌ అన్న అంటూ శుభాకాంక్షల విలువతో సోషల్ మీడియాలో ట్రెండ్‌ సృష్టిస్తుంది.
Illicit relationship: ఫ్రెండ్ భార్యతో ఎస్కేప్.. టెన్షన్‌ పడకు నాఫ్రెండ్‌కు తెలుసంటూ భార్యకు లేఖ