Site icon NTV Telugu

BJP Laxman: కేసీఆర్ పదిసార్లు బతిమాలినా నితీష్ కుమార్ కూర్చోలేదు

Nitish Kumar, Kcr

Nitish Kumar, Kcr

కేసీఆర్ పదిసార్లు బతిమాలినా నితీష్ కుమార్ కూర్చోలేదని, సీఎం తెలంగాణ పరువు తీశారని బీజేపీ నేత లక్ష్మణ్‌ విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట గెలవకుండా రచ్చ కెళ్తున్నారని లక్ష్మణ్ అన్నారు. అంతేకాకుండా.. కేసీఆర్ పదిసార్లు బతిమాలినా నితీష్ కుమార్ కూర్చోలేదని తెలిపారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, కేసీఆర్ ను పట్టించుకోలేదని.. కేసీఆర్ తెలంగాణా పరువు తీశారన్నారు. బీహార్ పర్యటనతో కేసీఆర్ అబాసు పాలయ్యారని, తెలంగాణలో అనేక సమస్యలతో సతమతమవుతుంటే కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లారని, నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నట్లు కనిపిస్తుందన్నారు. రాహుల్ గాంధీ మీ నాయకుడా..? ఎవరు మీ నాయకుడు అంటే కూర్చొని మాట్లాడుకుంటం అన్నారని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పదే పదే కూర్చోమని బ్రతిమిలాడే పరిస్థితి కేసీఆర్ కు వచ్చిందని విమర్శించారు.

గల్వాన్ లోయలో చనిపోయిన వారికి సహాయం చేస్తే తప్పు లేదు, మరి తెలంగాణలో చనిపోయిన వారి పరిస్థితి ఎంటి? ప్రశ్నించారు. ఇక తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఎందుకు ఆదుకోవడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ పట్టించుకోవడంలేదని సీరియస్ అయ్యారు. సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్, ఫాంహౌస్ కే పరిమితమై అదే ప్రపంచమనుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు దేశ రాజకీయమంటూ కొత్త నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పాలనను ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మునుగోడు భయం కేసీఆర్ కు బాగా పట్టుకుందని లక్ష్మణ్ తెలిపారు. ఇక కూరగాయల ధరలు పెరుగుతున్నాయంటున్న సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్రానికి కూరగాయలు పక్క రాష్ట్రాల నుంచి వస్తుంటే ఏం చేస్తున్నారని, క్యాబేజీ కర్ణాటక నుంచి, టమాట, బెండకాయలు ఏపీ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇక బీజేపీతో టీడీపీ పొత్తు అని వస్తున్న వార్తల్లో నిజం లేదని, తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ఆంద్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తో కలసి పోటీ చేస్తుందని, ఆంద్రప్రదేశ్ లో రోజురోజుకు బీజేపీ పెరుగుతుందన్నారు. ఇక బీజేపీ, టీడీపీ పొత్తుపై ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదని తెలిపారు.

Exit mobile version