Site icon NTV Telugu

అరుదైన ఘనత సాధించిన భూదాన్‌ పోచంపల్లి

భూదానణ్‌ పోచంపల్లి మరో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటికే ఈ గ్రామం ఎంతో గుర్తింపును తెచ్చుకోగా తాజాగా ప్రపంచ గుర్తింపు పొందింది.ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌) ఇటీవలే వెలువరించిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక గ్రామాల (Best Tourism Villages) జాబితాలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామం చోటు దక్కించుకుంది.

Read Also: జీవో 317పై స్టే ఇవ్వలేం: హైకోర్టు

ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు రాగా, మన దేశం నుంచి సిఫార్సు చేయబడ్డ మూడు గ్రామాల నుంచి భూదాన్ పోచంపల్లి ఈ అరుదైన ఘనతను సాధించింది.ఈ సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, టూరిజం శాఖ ఎండీ శ్రీ బి. మనోహర్ రావులు సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్‌లో కలిశారు.ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) సంస్థ జారీచేసిన గుర్తింపు పత్రాన్ని సీఎం చేతుల మీదుగా వారు అందుకున్నారు. భూదాన్‌ పోచంపల్లికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా కృషి చేసిన పర్యాటక శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Exit mobile version