Mallu Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాల ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధిర నియోజకవర్గంలోని మధిర చింతకాని మండలాలలోపలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మధిర మండలం బయ్యారంలో గ్రామ పంచాయతీ భవనం, చిలుకూరులో పాఠశాల భవనం, నిదానపురం, మాటూరులో ఆరోగ్య ఉపకేంద్రాలు, చింతకాని మండలం నాగులవంచలో రైతు వేదిక, చిన్నమండవలో ఆరోగ్య కేంద్రం, వాటర్ ప్లాంట్, డైనింగ్ హాల్‌ను భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. నాగులవంచ ప్రభుత్వ పాఠశాలలో, కోడుమూరులోని గ్రామ పంచాయతీ భవనం, విద్యుత్ సబ్ సెంటర్లలో. అలాగే సాయంత్రం 6 గంటలకు చింతకానిలో జరిగే అభినందన సభలో భట్టి పాల్గొంటారు.
Read also: Ra Kadalira: నేడు ఉరవకొండ చంద్రబాబు.. ‘రా.. కదలిరా’ పేరుతో పర్యటన..
ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర రావు పర్యటన..
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఖమ్మంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి సాయంత్రం 4 గంటలకు రఘునాధపాలెం మండలం మంచుకొండలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఖమ్మం రూరల్ మండలం పెదతండా ప్రియదర్శిని కళాశాలలో జరుగుతున్న సృజనోత్సవ్‌కు మంత్రి హాజరవుతారు.
Health Tips : మునగాకుతో ఇలా చేస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి తెలుసా?