Site icon NTV Telugu

Bhatti Vikramarka : కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి.. భట్టి ఫైర్‌

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : మహబూబాబాద్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మండిపడుతూ బీఆర్‌ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో లక్ష కోట్ల అప్పులు చేశారు. కానీ ఇప్పటి ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. మనపై అవాకులు చెవాకులు మాట్లాడే బీఆర్ఎస్ నాయకులకు నేను ఓ స్పష్టమైన సవాల్ చేస్తున్నాను.. అసెంబ్లీకి రండి, అన్ని విషయాలపై చర్చిద్దాం. ప్రెస్ క్లబ్ కాదు, ప్రజా ప్రతినిధుల సభ అయిన అసెంబ్లీనే సరైన వేదిక అని తెలిపారు.

కేటీఆర్ మాటలపై స్పందించిన భట్టి.. “నోరు ఉందని ఏది పడితే తట్టకుండా మాట్లాడితే ఎలా? గతంలో మీరు ఉన్నప్పుడు విద్యుత్ వినియోగం ఎంత? డిమాండ్ ఎంత? ఇవన్నీ మర్చిపోతే ఎలా? ఇప్పుడు రెండు వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగినా రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవు” అని అన్నారు.

“నువ్వు మాట్లాడినట్టుగా మళ్లీ మాట్లాడితే ఈసారి ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదు” అంటూ హెచ్చరించారు. అంతేకాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని కూడా ఖండించారు. “నదుల బేషన్‌లు కూడా తెలియవంటారా? ఇది ఎలాంటి విమర్శ?” అంటూ ప్రశ్నించారు.

“రైతులకు వాగ్దానాన్ని నెరవేర్చాం. రుణమాఫీ చేశాం. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. కానీ ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్ నేతలు విమర్శలకు పాల్పడుతున్నారు” అని వ్యాఖ్యానించారు.

“కేసీఆర్ మీరు అసెంబ్లీకి రండి, అన్ని లెక్కలతో చర్చిద్దాం. ప్రెస్ క్లబ్‌లో చర్చలు కావు. ప్రజల ఎదురుగా అసెంబ్లీ వేదికపై మాట్లాడుకుందాం” అని పునరుద్ఘాటించారు.

Bajaj Pulsar NS 400Z: రేసింగ్ లుక్‌తో రీడిజైన్‌డ్ బజాజ్ పల్సర్ NS400Z విడుదల..!

Exit mobile version