NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: భట్టి పాదయాత్రకు మీరు రండి.. నేను వస్తా..!

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క మండుటెండలో పాదయాత్ర చేయబోతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపు నిచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 16వ తేదీ నుండి తాను ప్రారంభించనున్న పాదయాత్ర గురించి చర్చించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో వైఎస్ ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో దగ్గరగా చూసిన అనుభవం మాకు ఉందని అన్నారు. పూర్తిగా పాదయాత్ర పెట్టుకున్నావ్ జాగ్రత్తగా నడవండి అని సలహా ఇచ్చానని అన్నారు. పెద్ద సెంటర్ లలో బహిరంగ సభలు పెట్టమని సూచించానని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు కోమటిరెడ్డి. మంచిర్యాల తో పాటు జడ్చర్ల లేదా షాద్ నగర్ లో పబ్లిక్‌ మీటింగ్‌ పెడుతున్నాం అన్నారు. నల్గొండ లో కూడా పెద్ద బహిరంగ సభ పెట్టాలని కోరానని అన్నారు. వారు కూడా ఒప్పుకున్నారని, తర్వాత నకిరేకల్, సూర్యాపేట లలో కూడా మినీ పబ్లిక్ మీటింగ్ పెట్టమని కోరానని తెలిపారు కోమటిరెడ్డి. ముగింపు సభకు రాహుల్ గాంధీ, లేదా ప్రియాంక గాంధీ ని పిలుస్తారా అనేది వారి ఇష్టమన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి శనివారం, ఆదివారం నేను తప్పకుండా పాదయాత్ర లో పాల్గొంటానని స్పష్టం చేశారు.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క..

తన పాదయాత్రకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొన్ని సూచనలు చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సుమారు గంటకు పైగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ నెల 16 నుండి తాను ప్రారంభించే పాదయాత్రలో పాల్గొనాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరినట్టుగా ఆయన చెప్పారు. ఈ యాత్రకు సంబంధించి ఎంపీ వెంకట్ రెడ్డి చేసిన సూచనలను పాటించనన్నట్టుగా ఆయన తెలిపారు. హాత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 16వ తేదీ నుండి పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం వరకు పాదయాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో కలిసి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించనున్నారు. నా పాదయాత్ర ఎలా పాల్గొనాలని కోమటిరెడ్డి ని ఆహ్వానించానని అన్నారు. పీసీసీ చీఫ్ పాదయాత్ర వేరే రూట్ లో వస్తుందని, నా పాదయాత్ర వేరే రూట్ లో ఉంటుందని తెలిపారు. అరవై శాతం టిక్కెట్లు నిర్ధారణ అయ్యాయి అనే విషయం నాకు తెలియదని భట్టి తెలిపారు.
Rashmi Gautam: కిర్రాక్ లుక్స్‌తో శారీలో మెరిసిన రష్మీ