NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: మానసిక పరివర్తనకు ధ్యానమే ఏకైక పరిష్కారం..

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: మానసిక పరివర్తనకు ధ్యానమే ఏకైక పరిష్కారం అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగూరులోని కన్హ శాంతి వనం,వెల్నెస్ సెంటర్ పరిశీలించారు. ప్రపంచ శాంతి కోసం ఏ స్థాయిలో ఉన్న మనం అంతా భాగస్వాములం కావాలన్నారు. ప్రపంచంలో నెలకొన్న అశాంతి నిర్మూలనకు శాంతి మార్గమే ప్రధానం.. అందుకు మానసిక పరివర్తన చెందాలి.. మానసిక పరివర్తనకు ధ్యానమే ఏకైక పరిష్కరించారు. ధ్యానం పై దృష్టి పెట్టి నిర్మించిన కన్హ శాంతి వనం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరం అన్నారు. ఏ సమస్యలు ఉన్నవారైనా కన్హ శాంతి వనంలో ధ్యానం చేసుకునేందుకు కావలసిన అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శంకర్ గారి కోరిక మేరకు శాంతి వనాన్ని సందర్శించానని తెలిపారు.

Read also: CM Revanth Reddy Brother: సీఎం రేవంత్‌ సోదరుడు తిరుపతి రెడ్డికి హైడ్రా నోటీసులు..

ధ్యానం కోసం ఎంతో ఖర్చు చేసి సుధీర ప్రాంతాలకు వెళ్తారు.. తక్కువ ఖర్చుతో ఇక్కడే ధ్యానం చేసుకునేందుకు శాంతి వనంలో ఏర్పాట్లు ఉన్నాయన్నారు. కులం మతం ప్రాంతంతో తేడా లేకుండా.. నిరుపేదలు కూడా ఉచితంగా ధ్యానం చేసుకునేందుకు ఒక డార్మెటరీ నిర్మించడం అభినందనీయమని తెలిపారు. వ్యవసాయాన్ని శాస్త్రీయంగా ఎలా నిర్వహించారు శిక్షణ ఇస్తున్నారు. అనేక రకాల మెడిసినల్ ప్లాంట్లను ఇక్కడ సాగు చేస్తున్నారని అన్నారు. వాతావరణాన్ని నియంత్రిస్తూ ఏ పంట అయినా ఎలా పండించాలో ఇక్కడ అనుభవంలో తెలుసుకోవచ్చన్నారు. యువతను ప్రోత్సహించేందుకు క్రికెట్ స్టేడియం ని నిర్మించారు, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని వీరు నిర్వహిస్తున్నారని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా పనిచేసేవారిని ప్రోత్సహించడం బాధ్యతగా భావించి శాంతి వనాన్ని సందర్శించానని తెలిపారు.
Etela Rajender: హైడ్రా అంటే ఓ డ్రామా.. ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు