Site icon NTV Telugu

చిన్న పిల్లల కోవాగ్జిన్‌కు అత్యవసర అనుమతి ఇవ్వాలి: భారత్‌ బయోటెక్


కరోనాకు కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ స్పూత్నిక్‌ వీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ చిన్నపిల్లలకు ఇప్పటి వరకు టీకా అందుబాటులోకి రాలేదు. ఇప్పటికే జైడస్‌ వ్యాక్సిన్‌ ఉన్న అది ఇంకా ఉపయోగంలోకి రాలేదు. ఈ క్రమంలోనే భారత్‌బయోటెక్‌ మరో ముందడుగు వేసి శుభవార్తను చెప్పింది. భారత్‌ బయోటెక్‌ యూఎస్‌ భాగస్వామి ఆక్యూ జెన్‌ చిన్నపిల్లలకు కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని యూఎస్‌ అధికారులను కోరింది.

2నుంచి18ఏళ్ల మధ్య వయస్సున్న వారికి ఈ వ్యాక్సిను అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసినట్టు భారత్‌ బయోటెక్‌ఫార్మా సంస్థ క్లినికల్‌ లీడ్‌ డాక్టర్‌ రాచెస్‌ ఎల్లా ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. పిల్లలకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజ నాలను ఆయన తెలిపారు. తమ భాగస్వామి ఆక్యూజెన్‌ కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతి కోరుతూ US-FDAకు ఫైలింగ్‌ చేసినట్టు తెలిపారు.

Exit mobile version