Site icon NTV Telugu

Yadadri: భక్తుల రద్దీ.. కొండపైకి వాహనాలు ‘నో ఎంట్రీ’

Bhadrari

Bhadrari

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు.

స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు. దీంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడం వల్లె వాహనాలను నిలిపి వేశామని అధికారులు తెలిపారు. దర్శించుకునేందుకే 2గంటలు పడుతుండటంతో.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భక్తులు అధికారులకు సహరించాలని కోరారు.

Kollu Ravindra: సామాజిక న్యాయానికి సమాధులు కట్టి యాత్రలా?

ఇక.. శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు సీతారాముల దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు.

భక్తులు భారీగా తరలిరావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో తీర్థప్రసాదాలను అధికారులు నిలిపివేశారు. దీంతో భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రూ.100 దర్శనానికి భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప్రత్యేకంగా అధికారులు రెండు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

Exit mobile version